ఒప్పుకుంటుందా? రేణు దేశాయ్ గురించి హాట్ టాపిక్!
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పెద్దగా వార్తల్లో నిలవడం లేదుగానీ....ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఆమె నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తన్న సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఆమె ఇటీవల ఇచ్చి ఇంటర్వ్యూ విషయం తెలుగు మీడియా సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది.
తాజాగా రేణు దేశాయ్ గురించి మరో వార్త వినిపిస్తోంది. ఆమె ఒప్పుకుంటే ఆమెతో సినిమాలు తీయాలని కొందరు తెలుగు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ భార్యగా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమెతో సినిమాలు తీస్తే మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నారు. మరి ఇంతకీ రేణు దేశాయ్ ఒప్పుకుంటుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

అటు నిర్మాతగా, దర్శకురాలిగా కెరీర్ కొనసాగిస్తూ....ఇటు పిల్లల బాధ్యత పర్ ఫెక్టుగా నిర్వర్తిస్తోంది రేణు దేశాయ్. పిల్లలంటే ఆమెకు ఎంతో ప్రేమ. పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత పిల్లలే తన సర్వస్వంగా జీవిస్తోంది. వారిని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఇక రేణు దేశాయ్ తాజా సినిమా విషయానికొస్తే... ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘ఇష్క్ వాలా లవ్' చిత్రాన్ని తెరకెంచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తొలుత అక్టోబర్ 10 విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసిన రేణు దేశాయ్, ఆ తర్వాత అక్టోబర్ 17 కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ రోజు కూడా విడుదల సాధ్యంకాలేదు. తర్వాత అక్టోబర్ 24న అనుకున్నప్పటికీ వీలు పడలేదు.
అయితే సినిమా వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అకీరా నటించిన తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఇష్క్ వాలా లవ్' ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో కలెక్షన్లు రాబట్టేలనే ముఖ్య ఉద్దేశ్యంతో అకీరాతో గెస్ట్ రోల్ చేయించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











