Just In
- 34 min ago
Box office: ప్లాప్ టాక్ వచ్చిన తగ్గని మాస్టర్ జోరు.. అప్పుడే సెంచరీ బాదేశాడు
- 1 hr ago
యష్ మాస్టర్ బ్యాక్‌పై కొడుతుంటే.. ముందు నుంచి మోనాల్ కౌగిలింతలు..
- 1 hr ago
డబ్బులే ముఖ్యం.. సినిమా ఇలా ఉంటేనే డబ్బులొస్తాయి.. అల్లుడు అదుర్స్ మూవీకి 50కోట్లు వచ్చినట్లే
- 1 hr ago
17 ఏళ్ల తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన మహేష్ గోపిచంద్
Don't Miss!
- News
ఈ అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి
- Finance
బ్యాడ్ బ్యాంకుపై RBI గవర్నర్ ఏమన్నారంటే? విదేశీ మారకపు నిల్వలు పెంచుకోవాలి
- Automobiles
ముఖేష్ అంబానీ ఇంట టైర్లు మోపిన రెండవ రోల్స్ రాయిస్ కార్: వీడియో
- Sports
జో రూట్ డబుల్ సెంచరీ.. కష్టాల్లో శ్రీలంక!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాబు వదినగా మారనున్న రేణు దేశాయ్.. త్వరలోనే స్పెషల్ అప్డేట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న వారిలో రేణు దేశాయ్ ఒకరు. ఆమె మళ్ళీ వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక మరికొన్ని సినిమాలను చేయాలని ఉన్నా అప్పట్లో హెల్త్ ప్రాబ్లమ్ వల్ల చేయలేనని చెప్పింది. ఇక ఇప్పుడు మరోసారి ఆమె రీ ఎంట్రీపై కథనాలు వెలువడుతున్నాయి.

ఆ సినిమాలో కూడా..
మరోసారి మహేష్ బాబుకు సంబంధించిన సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మొన్న ఆ మధ్య మహేష్ బాబు ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమాలో అడివి శేష్ తల్లి పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే తరహాలో మరొక టాక్ వస్తోంది.

వదిన పాత్రలో..
సెకండ్ ఇన్నింగ్స్ లో సిస్టర్, చిన్నప్పటి హీరోకు మదర్.. వదిన వంటి హోమ్లీ పాత్రలు చేస్తానని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు రేణు దేశాయ్. పాత్ర బావుంటే తప్పకుండా నటిస్తానని ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్న రేణు దేశాయ్ ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకు వదినగా నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

సరికొత్తగా ఉండాలని..
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో రేణు దేశాయ్ ను వదిన పాత్ర కోసం ఫిక్స్ చేసినట్లు సమాచారం. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయట. సరికొత్తగా ఉండాలని ఆమెను తీసుకున్నట్లు స్టోరీలు వినబడుతున్నాయి.

త్వరలోనే మరో అప్డేట్
ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని మహేష్ బాబుకు రేణు దేశాయ్ వదిన పాత్రలో నటిస్తే ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఈ సంక్రాంతికి రానున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఒక సీనియర్ హీరో కూడా నెగిటివ్ పాత్రలో కనిపిస్తారట. అలాగే విలన్ పాత్రపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వవచ్చని టాక్.