యంగ్ హీరోకి అక్కగా రేణుదేశాయ్.. టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్ధం!

కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ తో వివాహం తర్వాత సినిమాలు చేయలేదు. పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ దర్శకురాలిగా, రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కొన్ని టివి షోలకు సంబంధించిన ఆఫర్స్ కూడా రెండు దేశాయ్ కు వస్తునాలు ఊహాగానాలు మొదలవుతున్నాయి. ఇటీవల తిరిగి నటించే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా.. తాను నటిగా కన్నా దర్శకురాలిగానే గుర్తింపు పొందాలని అనుకుంటున్నట్లు రేణు దేశాయ్ తెలిపింది. తాజాగా రేణు దేశాయ్ కు టాలీవుడ్ నుంచి అవకాశాలు అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సీనియర్ హీరోయిన్లు

సీనియర్ హీరోయిన్లు

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు తల్లి, వదిన,అక్క పాత్రల కోసం సీనియర్ హీరోయిన్లని ఎంపిక చేసుకుంటున్నారు. నదియా, ఖుష్బూ, రమ్యకృష్ణ లాంటి అలనాటి హీరోయిన్లంతా తల్లి పాత్రల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. స్నేహ లాంటి హీరోయిన్లు వదిన పాత్రలో మెప్పిస్తున్నారు. ఇలాంటి అవకాశాలే రేణు దేశాయ్ కి కూడా అందుతున్నట్లు తెలుస్తోంది.

నటనకు దూరంగా

నటనకు దూరంగా

పవన్ కళ్యాణ్ సరసన నటించిన జానీ చిత్రం తర్వాహ రేణు దేశాయ్ మళ్ళీ నటన జోలికి వెళ్ళలేదు. జానీ చిత్రం విడుదలై 15ఏళ్ళు గడిచిపోతోంది. ప్రస్తుతం దర్శకురాలిగా ప్రయత్నిస్తున్న సరైన సక్సెస్ రావడం లేదు. దీనితో తిరిగి నటించాలనే ఆలోచనలో రేణు దేశాయ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ కు వంశీ కృష్ణ అనే దర్శకుడు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో ఓ పాత్ర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

 బెల్లంకొండ శ్రీనివాస్‌కు అక్కగా

బెల్లంకొండ శ్రీనివాస్‌కు అక్కగా

వంశి కృష్ణ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో రేణు దేశాయ్ బెల్లంకొండ శ్రీనివాస్ కు అక్కగా నటించబోతోందట. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న ఈ వార్త గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చాలా రోజులుగా ఈ చిత్రం గురించి వార్తలు వస్తున్నా ఇంకా ప్రారంభం కావడంలేదు.

 ముందుగా రానా

ముందుగా రానా

ముందుగా ఈ చిత్రం కోసం దర్శకుడు హీరోగా రానాని అనుకున్నాడు. కానీ రానా తప్పుకోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ చేతుల్లోకి ఈ ప్రాజెక్టు వెళ్ళింది. రేణు దేశాయ్ ఈ చిత్రంలో నటించేది ఖాయం అయితే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. రేణు దేశాయ్ రచయితగా, దర్శకురాలిగా మరి కొన్ని చిత్రాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల రేణు దేశాయ్ రచించిన ఎ లవ్ అన్ కండిషనల్ అనే పుస్తకం తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X