ఆ బయోపిక్‌ను రిజెక్ట్ చేసిన రేణు దేశాయ్.. వాళ్ల ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం

By Manoj Kumar P

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలో పవన్‌తో ప్రేమలో పడడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది ఈ మాజీ మోడల్. ఇక, పవర్‌స్టార్‌తో విడాకులు తీసుకున్న తర్వాత స్వతంత్ర జీవితం గడుపుతోంది రేణు.

ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్‌గా రెండు సినిమాలు, దర్శకురాలిగా ఓ సినిమాను చేశారు. నటిగా మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు. అయితే, కొద్ది రోజుల క్రితం ఆమె టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇదంతా నిజం కాదని కూడా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్? వివరాల్లోకి వెళితే..

 డైరెక్టర్‌గా మారిన రేణు

డైరెక్టర్‌గా మారిన రేణు

పవన్‌తో విడిపోయిన తర్వాత పుణెలో ఉంటున్న రేణు దేశాయ్.. ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరించింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో మరోసారి దర్శకత్వం వైపు చూడలేదు. కానీ, కొన్ని వెబ్ సిరీస్‌లు నిర్మించడానికి ప్రయత్నాలు చేసింది. అలాగే, సినిమాలు కూడా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

తెలుగులో రీఎంట్రీ

తెలుగులో రీఎంట్రీ

రేణు దేశాయ్ ‘జానీ' సినిమా తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే, కొద్ది రోజుల క్రితం ఆమె టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు వచ్చాయి. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ద్వారా ఆమె తెలుగు సినిమాల్లోకి రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా.. ‘దొంగాట' డైరెక్టర్ వంశీ కృష్ణ దీనిని తెరకెక్కించనున్నాడు.

రైటర్ వ్యాఖ్యలతో క్లారిటీ

రైటర్ వ్యాఖ్యలతో క్లారిటీ

రేణు దేశాయ్ రీఎంట్రీ విషయాన్ని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా వెల్లడించారు. ఈ సినిమాకు మాటల రచయితగా పని చేస్తున్న ఆయన ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల సాయి మాధవ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే చిత్ర బృందం సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం రేణు దేశాయ్‌తో సంప్రదింపులు జరిపిందని చెప్పుకొచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలిపారు.

 మొదట ఒప్పుకున్నా.. తర్వాత నో అందట

మొదట ఒప్పుకున్నా.. తర్వాత నో అందట

ఈ సినిమా చేయడానికి రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. చిత్ర యూనిట్ మొదట ఈ పాత్రకు రేణు దేశాయ్‌ను అనుకుని ఆమెతో సంప్రదింపులు జరిపారట. ఇందులో ఆమె ఓ తెలుగు కవి కుమార్తె పాత్రను పోషించడానికి అంగీకారం తెలియజేశారట. అయితే, తర్వాత ఆమె ఈ సినిమా చేయనని చెప్పారనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

#CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
వాళ్ల ఒత్తిడే కారణం

వాళ్ల ఒత్తిడే కారణం

వాస్తవానికి రేణు దేశాయ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా.. కొందరు ఒత్తిడి చేయడం వల్ల దీని నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కొందరు స్నేహితులు.. సహాయ నటి పాత్రలు చేయవద్దని రేణుకు సలహా ఇచ్చారట. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే ఒప్పుకోమని ఒత్తిడి తెచ్చారట. ఈ కారణంగానే ఆమె టైగర్ నాగేశ్వర్రావు బయోపిక్ నుంచి తప్పుకున్నారని తాజాగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X