తల్లి పాత్రలో నటించమని అడిగితే.. రేణు దేశాయ్ ఏం సమాధానం చెప్పిందో తెలుసా!
కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ తో వివాహం తర్వాత సినిమాలు చేయలేదు. పవన్ ఉంచి విడిపోయాక కూడా ఆమె నటనపై దృష్టి పెట్టలేదు. కానీ రేణు దేశాయ్ దర్శకురాలిగా, రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కొన్ని టివి షోలకు సంబంధించిన ఆఫర్స్ కూడా రెండు దేశాయ్ కు వస్తునాలు ఊహాగానాలు మొదలవుతున్నాయి. ఇటీవల తిరిగి నటించే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా.. తాను నటిగా కన్నా దర్శకురాలిగానే గుర్తింపు పొందాలని అనుకుంటున్నట్లు రేణు దేశాయ్ తెలిపింది. తాజాగా రేణు దేశాయ్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

సీనియర్ హీరోయిన్లు
ప్రస్తుతం చిత్రాల్లో తల్లి పాత్రల కోసం దర్శకులు సీనియర్ హీరోయిన్లని ఎంపిక చేసుకుంటున్నారు. నదియా, ఖుష్బూ, రమ్యకృష్ణ లాంటి అలనాటి హీరోయిన్లంతా తల్లి పాత్రల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. మరికొందరు హీరోయిన్లు కూడా తల్లి పాత్రలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు ఆలాంటి పాత్రల్లో నటిస్తే సినిమాకు క్రేజ్ పెరుగుతుంది. తాజాగా రేణు దేశాయ్ కి కూడా ఆ తరహా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

తల్లి పాత్ర కోసం అడిగితే
ఇటీవల ఓ నిర్మాత రేణు దేశాయ్ తాను నిర్మించే చిత్రంలో తల్లి పాత్రలో నటించాలని కోరారట. రేణు దేశాయ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆ నిర్మాతతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకూడా రేణు తల్లి పాత్రకు అంగీకరించలేదని సమాచారం. తనకు ఆరోగ్యం సరిగా ఉండడం లేదని, అందువలన నటించలేనని చెప్పిందట. దీనితో రేణు దేశాయ్ తల్లి పాత్రలు చేయడం ఇష్టంలేక ఆలా చెప్పిందా లేక నటనపై ఆసక్తి లేక అలా చెప్పిందా అనే చర్చ సాగుతోంది.

ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి
కానీ రేణు దేశాయ్ ని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు తమకు తోచిన విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ రచయితగా మారి కవిత్వాలు రాస్తోంది. ఇటీవల ఆమె రాసిన కవితల పుస్తకాన్ని పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తెలుగులోకి అనువదించారు.

ఎ లవ్ అన్ కండిషనల్
ఎ లవ్ అన్ కండిషనల్ పేరుతో రేణు దేశాయ్ రాసిన ఈ పుస్తకం అనేక పుకార్లు కూడా ప్రచారం జరిగాయి. ఆ పుకార్లన్నింటికీ చెక్ పెడుతూ.. తాను ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి రాయలేదని ఇటీవల ఇంటర్వ్యూలో స్ఫష్టం చేసింది. పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ పూణేలో తన పిల్లలతో ఉంటున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











