ఉన్నట్టుండి తప్పుకున్న రేణు దేశాయ్.. వైరల్ అవుతున్న న్యూస్
1970-80 మధ్యకాలంలో రాబిన్ హుడ్‌గా పేరు పొందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా 'టైగర్' అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుండగా.. ఒకరు నిధిఅగర్వాల్, మరొకరు పాయల్ రాజ్‌పుత్ సెలెక్ట్ అయ్యారు. అయితే చిత్రంలో పాయల్ పాత్ర స్పెషల్ అట్రాక్షన్ కానుందట. ఇక ఈ చిత్రంలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు.
కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని, కథను మలుపుతిప్పే రోల్‌లో సామాజిక కార్యకర్తగా రేణుదేశాయ్ నటించనుందని వార్తలు విన్నాం. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నుంచి ఉన్నట్టుండి రేణుదేశాయ్ తప్పుకుందని తెలుస్తోంది. అయితే రేణుదేశాయ్ డ్రాప్ కావడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో RX 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే గతంలో వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమాలో పాయల్ వేశ్య పాత్రలో కనిపిస్తుందని తెలిసింది. కానీ ఇటీవలే రిలీజైన ఓ ఫోటో ద్వారా పాయల్ పాత్రపై క్లారిటీ వచ్చింది. పోలీస్ పాత్ర అయినప్పటికీ ఇందులో బోల్డ్ లుక్ లోనే ఆమె కనిపిస్తుందని అంటున్నారు. దీంతో పాటు రవితేజ హీరోగా వస్తున్న డిస్కోరాజాలో బధిర యువతిగా, వెంకీ మామ సినిమాలో వెంకటేష్ జోడీగా నటిస్తోంది పాయల్ రాజ్‌పుత్.


Click it and Unblock the Notifications











