రేణు దేశాయ్ రీఎంట్రీ.. ప్రముఖ నిర్మాత కుమారుడి సినిమాతో..

Recommended Video

Renu Desai Re Entry In Telugu Film Industry || Filmibeat Telugu

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలో పవన్‌తో ప్రేమలో పడడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది ఈ మాజీ మోడల్. ఇక, పవర్‌స్టార్‌తో విడాకులు తీసుకున్న తర్వాత స్వతంత్ర జీవితం గడుపుతోంది రేణు.

తెలుగులో రీఎంట్రీ

తెలుగులో రీఎంట్రీ

రేణు దేశాయ్ ‘జానీ' సినిమా తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే, తాజాగా ఆమె టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు వస్తున్నాయి. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ద్వారా ఆమె తెలుగు సినిమాల్లోకి రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా.. ‘దొంగాట' డైరెక్టర్ వంశీ కృష్ణ దీనిని తెరకెక్కించనున్నాడు.

క్లారిటీ ఇచ్చిన రైటర్

క్లారిటీ ఇచ్చిన రైటర్

రేణు దేశాయ్ రీఎంట్రీ విషయాన్ని ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా వెల్లడించారు. ఈ సినిమాకు మాటల రచయితగా పని చేస్తున్న ఆయన ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల సాయి మాధవ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే చిత్ర బృందం సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం రేణు దేశాయ్‌తో సంప్రదింపులు జరిపిందని చెప్పుకొచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలిపారు.

‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అంటూ వార్తలు

‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అంటూ వార్తలు

రేణు దేశాయ్ త్వరలో తెలుగులో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్' సీజన్ -3లో కంటెస్టెంట్‌గా రాబోతున్నారంటూ ఓ వార్త ఎన్నో రోజుల పాటు హల్‌చల్ చేసింది. దీంతో అందరూ ఆమె ఆ షోలో పాల్గొనబోతుంది అనుకున్నారు. కానీ, ఇటీవల రేణు ఈ వార్తలపై స్పందించింది. తాను ఈ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, కంటెస్టెంట్‌గా కంటే హోస్ట్‌గా చేయమంటే చేస్తానంటూ చెప్పుకొచ్చింది.

 మరాఠీలో డైరెక్టర్‌గా ఎంట్రీ

మరాఠీలో డైరెక్టర్‌గా ఎంట్రీ

పవన్‌తో విడిపోయిన తర్వాత పుణెలో ఉంటున్న రేణు దేశాయ్.. ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరించింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో మరోసారి దర్శకత్వం వైపు చూడలేదు. కానీ, కొన్ని వెబ్ సిరీస్‌లు నిర్మించడానికి ప్రయత్నాలు చేసింది. అలాగే, సినిమాలు కూడా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X