Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నలుగురితో ముడిపెట్టి అనుష్క అఫైర్స్‌పై కథనాలు
నలుగురు సినీ ప్రముఖులతో ముడిపెట్టి హీరోయిన్ అనుష్క లవ్ అఫైర్స్‌పై తమిళ పత్రికలు కోడై కూస్తున్నాయి. తెలుగు హీరో, నాగార్జున కుమారుడు నాగ చైతన్యతో అనుష్కకు నిశ్చితార్థం జరిగిందంటూ పెద్ద యెత్తున వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. అయితే, నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూ తన భాయ్ ఫ్రెండ్ పేరు చెప్తే ఆశ్చర్యపోతారని అనుష్క చెప్పడంతో ఆ బాయ్ ఫ్రెండ్‌కు సంబంధించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నాగచైతన్యతో అనుష్క నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన వార్తలను హీరో అక్కినేని నాగార్జున మేనేజర్ కూడా ఖండించారు. ఈ విషయంపై మాట్లాడడానికి నాగార్జున అందుబాటులో లేరని అంటున్నారు. అక్కినేని కుటుంబం మాత్రం ఆ వార్తలను ఖండిస్తోంది.
కాగా, నాగచైతన్యతోనే కాకుండా తెలుగు హీరో గోపీచంద్, దర్శకుడు క్రిష్, తమిళ మాస్ హీరో విజయ్‌లతో అనుష్క పేరును జోడించి వార్తాకథనాలు జోరందుకున్నాయి. లక్ష్యం సినిమా షూటింగ్ సందర్బంగా అనుష్కకు, గోపీచంద్‌కు మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అంటున్నారు. వారిద్దరు కలిసి తిరిగారని ఊహాగానాలు చెలరేగాయి. అలాగే, వేదం సినిమా షూటింగ్ సందర్భంగా అనుష్కకు దర్శకుడు క్రిష్‌తో సంబంధాలు ఏర్పడ్డాయని కూడా ప్రచారం జరిగింది. అలాగే తమిళ హీరో విజయ్‌తో అనుష్క చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద, అనుష్క ప్రేమాయణాలకు సంబంధించి ఒకదానికొకటి సంబంధం లేకుండా వార్తకథనాలు వస్తున్నాయి.