లీకైంది: 'బాహుబలి-ది కంక్లూజన్' లో కొత్త క్యారక్టర్
హైదరాబాద్: దేవకట్టా కు పేరు తెచ్చి పెట్టిన ప్రస్దానంలో పోలీస్ అధికారిగా చేసిన అజయ్ ఘోష్ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయన ఈ మధ్యన ఛార్మి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతి లక్ష్మిలోనూ నెగిటివ్ పాత్రను చేసారు. ఇప్పుడు ఆయన్ను బాహుబలి చిత్రంలో ఓ కీలకమైన పాత్ర వరించిందని సమాచారం.
అదంతున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందిస్తున్న బాహుబలి..ది కంక్లూజన్ లో బందిపోటు వీరయ్యగా కనిపించి అలరించనున్నారని టాక్. దేవసేన(అనుష్క) ఉంటున్న ట్రైబల్ విలేజ్ లో ఈ పాత్ర ఉంటుందని చెప్తున్నారు.

మొన్న జరిగిన కేరళ షెడ్యూల్ లో అజయ్ ఘోష్ పై వారం రోజులు పాటు కీలకమైన సీన్స్ తీసారని చెప్తున్నారు. ఈ పాత్రతో అజయ్ ఘోష్ కు దేశ వ్యాప్తంగా పేరు వస్తుందని భావిస్తున్నాడు. మార్చి నుంచి జరిగే మరో షెడ్యూల్ లోనూ అజయ్ ఘోష్ పాల్గొననున్నారు.
చిత్రం విశేషాలకు వస్తే...త్వరలో యూ ఎస్ షెడ్యూల్‌కు వెళ్ళనుంది రాజమౌళి అండ్ టీం. త్వరగా ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

అలాగే కంక్లూజన్ అనేది సీక్వెల్ కాదని, ఒకే కథని రెండు భాగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు రాజమౌళి. బాహుబలి చిత్రానికి మూడో భాగం కూడా ఉంటుందని, దీనికి , తొలి రెండు భాగాలకు ఎలాంటి సంబంధం ఉండదని రాజమౌళి తెలిపారు.
ఇప్పటి వరకు బాహుబలి 3 చిత్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకోని రాజమౌళి తాజాగా బాహుబలి కామిక్ బుక్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసారు. త్వరలో గేమ్స్ యానిమేషన్స్ ద్వారా బాహుబలి ని ప్రపంచవ్యాప్తంగా మరింతగా జనాల్లోకి తీసుకుని వెళ్లనున్నారు రాజమౌళి.


Click it and Unblock the Notifications











