twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో జూ.ఎన్టీఆర్.. ఆ సీన్ కట్ చేశారా, తెర వెనుక మామ!

    |

    వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేసి తీరుతానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ సింహగర్జన పేరుతో హైదరాబాద్ లో ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ గోపాల్ వర్మకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో జూ. ఎన్టీఆర్ పాత్ర గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు వర్మ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

     జూ.ఎన్టీఆర్

    జూ.ఎన్టీఆర్

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో జూ. ఎన్టీఆర్ పాత్ర ఉంటుందా అని ప్రశ్నించగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య జరిగిన సంఘటనలతో తీస్తున్నట్లు వర్మ తెలిపారు. ఎన్టీఆర్ మరణించే సమయానికి జూ. ఎన్టీఆర్ ఇంకా నటుడు కాలేదని, ఎవరికీ తెలియదు కూడా అని వర్మతెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని చూపిస్తున్న వర్మ జూ.ఎన్టీఆర్ ని చూపించకుండా ఉంటాడా అనే చర్చ కూడా జరుగుతోంది.

    ఎన్టీఆర్ వద్దకు

    ఎన్టీఆర్ వద్దకు

    లక్ష్మి పార్వతి పలు ఇంటర్వ్యూలలో జూ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. జూ. ఎన్టీఆర్ ని, అతడి తల్లిని వాళ్ళ తాత వద్దకు తీసుకెళ్లింది నేనే అని లక్ష్మి పార్వతి పలు సందర్భాల్లో తెలిపారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో గొడవ మొదలైన సందర్భంలో జూ. ఎన్టీఆరే తన ఫోటోని చించి బయటపడేశాడని లక్ష్మీ పార్వతి తెలిపింది. ఆ సన్నివేశాలని వర్మ ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్ పేరు వాడకుండా చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

    కెజిఎఫ్ డైరెక్టర్‌తో చర్చలు.. మహేష్ బాబు నుంచి ప్యాన్ ఇండియా మూవీ?కెజిఎఫ్ డైరెక్టర్‌తో చర్చలు.. మహేష్ బాబు నుంచి ప్యాన్ ఇండియా మూవీ?

     తొలగించమని

    తొలగించమని

    లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వైసీపీకి చెందిన వ్యక్తి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జూ. ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావు ఇటీవల వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జీవిని జూ. ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలని తొలగించమని రిక్వస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో వర్మ జూ. ఎన్టీఆర్ సన్నివేశాల్ని తొలగిస్తాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ తొలగించకపోయినా జూ. ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా చూపించాలని వర్మ భావిస్తున్నాడట. అందుకే శుక్రవారం జరిగిన ఈవెంట్ లో వర్మ మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణించే సమయానికి జూ. ఎన్టీఆర్ ఎవరికీ తెలియదు అని వ్యాఖ్యానించాడు.

     రెండు ట్రైలర్స్

    రెండు ట్రైలర్స్

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన రెండు ట్రైలర్స్ ని వర్మ విడుదల చేశారు. ఈ రెండు ట్రైలర్స్ లో దాదాపుగా ఎన్టీఆర్ కుటుంబం మొత్తాన్ని వర్మ చూపించాడు. ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి పాత్ర తర్వాత చంద్రబాబు పాత్రే చర్చనీయాంశంగా మారుతోంది. హరికృష్ణ, పురందేశ్వరి, బాలకృష్ణ పాత్రలని కూడా వర్మ చూపించాడు.

    English summary
    RGV about Jr NTR at Lakshmi's NTR Simha Garjana
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X