ఒకే సబ్జెక్టుతో దేవకట్టా,రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ, ప్రస్ధానం దర్శకుడు దేవకట్టా ప్రస్తుతం ఒకే సబ్జెక్టుపై పనిచేస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ కూడా బెజవాడ రౌడీల బ్యాక్ డ్రాప్ లో జరిగే కథతో తమ చిత్రాలు రూపొందించేందుకు స్క్రిప్టులు రెడీ చేసుకుంటున్నట్లు వినపడుతోంది. ఇక చాలా రోజులుగా దేవకట్టా..ఈ సబ్జెక్టుపై వెర్షన్స్ రాసుకుంటున్నారని, నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించటానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే హఠాత్తుగా అనుకోని విధంగా రామ్ గోపాల్ వర్మ సీన్ లోకి రావటం దేవకట్టాని ఉలిక్కిపడేటట్లు చేసిందని చెప్తున్నారు.
తాజాగా తెలుగుదేశం లీడర్ చలసాని పండు హత్య, రౌడీ ప్యాక్షనిజం వార్తల్లో ఉండటంతో ఈ న్యూస్ రామ్ గోపాల్ వర్మ ఎనౌన్స్ చేసారని అంతా భావిస్తున్నారు. ఈ చిత్రం స్క్రిప్టు ఫైనల్ స్టేజస్ లలో ఉంది అన్నారు. ఇక తన చిత్రం విజయవాడ..రౌడీ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుందని ఆయన అంటున్నారు. అప్పలరాజు చిత్రం పూర్తవగానే ఈ చిత్రం ప్రారంభిస్తానంటున్నారు. ఇక గతంలోనూ విజయవాడు కాలీజీ, పాలిటిక్స్ నేపద్యంలో శివ చిత్రం రూపొందించి ఘన విజయం సాధించారు వర్మ. కాని వర్మ తీసే కథ వేరని, దేవకట్టా చూపించే ఎమోషన్స్ వేరని విశ్లిషిస్తున్నారు. ఇంతకీ ఎవరిది ముందు మొదలవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











