రంజితతో స్టార్ డైరక్టర్ సీక్రెట్ మీటింగ్
నిత్యానంద సెక్స్ స్కామ్ కేసులో ఇరుక్కున్న రంజితను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీక్రెట్ గా కలుసుకన్నట్లు గుప్పుమంది.ఎప్పుడూ ఏదో ఒక కాంట్రావర్శీలో ఉండటానికి ఇష్టపడే వర్మ ఏ కారణం చేత ఆమెను కలుసుకున్నాడనేది ముంబై ఫిల్మ్ సర్కిల్సో లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఆమెను కలుసుకోవాటనికి కారణం ఓ సినిమా ప్రపోజల్ అని చెప్తున్నారు.ఇంతకుముందు నిత్యానంద స్కామ్ బయిటకు రాగానే ఆయన గాడ్ అండ్ సెక్స్ అనే సినిమా హడావిడిగా ప్రకటించారు.
కానీ అది ఇప్పటికీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.ఆమెను కలిసి ఆమెను ప్రధాన పాత్రలో పెట్టి సినిమా ప్లాన్ చేస్తారా లేక ఆమె చెప్పే వెర్షన్ ని బేస్ చేసుకుని సినిమా చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం ఆయన నాట్ ఎ లవ్ స్టోరీ అనే హిందీ చిత్రంలో బిజీగా ఉన్నారు.మరో ప్రక్క రానా,అమితాబ్,సంజయ్ దత్ లతో డిపార్టమెంట్ చిత్రం షూటింగ్ కి రెడీ చేస్తున్నారు.వీటితో పాటుగా ఆయన నాగచైతన్యతో బెజవాడ రౌడీలు చిత్రం షూటింగ్ లో కూడా పాల్గొని పర్యవేక్షిస్తున్నారు.ఇక రంజితతో ఆయన సినిమా చేస్తే మాత్రం మంచి క్రేజ్ వస్తుందని మాత్రం మార్కెట్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











