'ఫ్యాక్షన్ గడ్డ' పై వర్మ
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాము తాజాగా ఫ్యాక్షన్ గడ్డ 'అనంతపురం'లో దర్శనమిచ్చారు. అనంతపురం ఎస్పీ యం.కె.సింగ్ తో సమావేశమయ్యారు. ఇదంతా ఎందుకంటే తెలుగు దేశం నేత, ఎమ్మెల్యే దివంగత పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న 'రక్త చరిత్ర' సినిమా షూటింగ్ అనంతపురం జిల్లాలో తీయబోతున్నందున భద్రతా విషయాలరిత్యా సమావేశమయినట్టు తెలిసింది. ఇంతకు ముందు వర్మ పరిటాల రవి భార్య పరిటాల సునీత తోనూ, మద్దెల చెరువు సూరి తో జైల్లోనూ సమావేశమయిన విషయం తెలిసిందే.
వివేక్ ఒబెరాయ్ రవి పాత్రలో, 'గజిని' సూర్య 'మద్దెల చెరువు సూరి' పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'రక్త చరిత్ర 1', 'రక్త చరిత్ర 2' లుగా రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం సర్వత్రా ఆసక్తిరేగిస్తోంది. కాగా ఈ మధ్యనే విడుదలైన వర్మ చిత్రం 'అడవి' పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నా ఇవేవీ పట్టించుకోని రాము రక్త చరిత్ర సినిమా పనుల్లో తలమునకలైపోయారు.


Click it and Unblock the Notifications











