ఆర్.జి.వి 'కాంట్రాక్ట్' లో మల్లికా షెరావత్

By Staff

Mallika Sherawat
1998 లో 'సత్య', 2002 లో 'కంపెనీ' సినిమాలతో బాలీవుడ్ కి ముంబాయి అండర్ వరల్డ్ అంటే రుచి చూపిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు 'కాంట్రాక్ట్' అనే సినిమా రెడీ చేస్తున్నారు. అండర్ వరల్డ్ మీట్స్ టెర్రరిజం అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా అప్పుడే ట్రేడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇది వర్మ అండర్ వరల్డ్ ఫిల్మ్ ట్రయాలిజీ అంటున్నారు. ఇక సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఆమె తన నిజ జీవత పాత్రనే ఈ సినిమాలో చేసిందని చెప్పుకుంటున్నారు.

ఇక కాంట్రాక్ట్ కథ మొత్తం 90 లనాటి ముంబాయి అండర్ వరల్డ్ జీవితాన్ని చూపుతుందని చెప్పుకుంటున్నారు. విశ్వశనీయ సమాచారం ప్రకారం కాంట్రాక్ట్ ఒకప్పుడు ముంబాయి మహానగరాన్ని దడదడ లాడించిన ఛోటా రాజన్ బయోగ్రఫిగా తయారవుతోందని తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీంతో ఛోటా రాజన్ విడిపోయి వార్ ప్రకటించాక జరిగే పరిణామాలని ఈ సినిమా చర్చిస్తుందిట. ఇందులో ముఖ్యంగా రాజన్ బ్యాంకాక్ లో దావూద్ మనుషులని ఎదిరించే ఎపిసోడ్లు హైలట్ గా ఉంటాయట.

అలాగే ఇండియన్ ఇంటిలిజెన్సి ఏజన్సీ రాజన్ ని రక్షించి ,పెంచి పోషించటం అందుకు కారణం దావూద్ ని ఎదుర్కోవటానికి అతన్ని వాడుకోవాలనేది చర్చిస్తున్నారట. ఇక రాజన్ క్యారెక్యర్ కంపెనీలో వివేక్ ఒబెరాయ్ ని పోలి ఉంటుందిట. దాన్ని Upendra Limaye చేస్తున్నాడు. Upendra మంచి పేరున్న మరాఠీ రంగస్ధల నటుడు. అతను పేజ్ త్రి, ట్రాఫిక్ సిగ్నల్, సర్కార్ రాజ్ సినిమాలో గతంలో నటించాడు. ఇక సర్కార్ రాజ్ హిట్ తో ఖుషీగా ఉన్న వర్మ ఈ సినిమాను ఓ లెజెండ్ లా మిగిలిపోయాలా ఉండాలని తీర్చిదిద్దుతున్నాడు.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X