Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వర్మ నెక్ట్స్ చిత్రం 'అమ్మ'(3డి) పూర్తి డిటేల్స్
త్వరలో రామ్ గోపాల్ వర్మ "అమ్మ" టైటిల్ తో ఓ త్రీడీ ఎడ్వంచర్ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేయనున్నారని సమాచారం. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ బాషల్లో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. అలాగే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన నటీనటులను ఈ చిత్రం కోసం తీసుకుంటారని చెప్తున్నారు. అలాగే అమిరికెన్స్, చైనీస్ కూడా ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. జనవరి 2011లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఏప్రియల్ లో షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం అమిజాన్ ఫారెస్ట్(బ్రెజిల్), కాంగో బేసిన్(ఆఫ్రికా), కాస్పియన్ సముద్రం(ఇరాన్ దగ్గరలో)ని వంటి లొకేషన్స్ ఇప్పటికే ఎంపిక చేసారు.
అమ్మ అన్నారు కదాని ఇదేదో సెంటిమెంట్ సినిమా అనుకోవద్దు. ఈ చిత్రం ట్రెజర్ హంట్ బేస్ గా కథ నడవనుంది. ఈ చిత్రంలో కేవలం విలన్స్ మాత్రమే ఉంటారు. హీరోలు ఉండరని వినికిడి. ఇక ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు టెన్షన్ సన్నివేశాలు సస్పెన్స్ తో కూడిన ట్విస్టులు ఉంటాయన్నారు. అలాగే క్యారెక్టర్స్ కూడా చాలా ఢిపెరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నానన్నారు. విజువల్ గా హైలెట్ గా ఉండి త్రిడీతో ఓ సినిమాటెక్ ఎక్సపీరియన్స్ ని ఆడియన్స్ కు కలిగించే దిశలో తన చిత్రం రూపొందుంతోందన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తిగా పూర్తయిందన్నారు. హాలీవుడ్ మెకనాస్ గోల్డ్, రైడర్స్ ఆఫ్ లాస్ట్ ఆర్క్ వంటి చిత్రాలను తను పూర్తిగా అబిమానిస్తానని, అటువంటి చిత్రంలా సాహసాలతో కూడిన ప్రపంచాన్ని తన త్రీడి చిత్రంలో ఆవిష్కించనున్నానని వర్మ గతంలో చెప్పారు. వివేక్ ఒబెరాయ్, నసీరుద్దీన్ షా, అర్జున్, జాయేద్ఖాన్, అభిమన్యుసింగ్, సోనూసూద్, సుబ్బరాజు, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తారు.