రామ్ గోపాల్ వర్మ దారిలోనే బ్రహ్మానందం కూడా...

By Srikanya

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర 2 కోసం కత్తులతో సావాసం..అనే పాటను పాడి గాయకుడుగా మారారు. ఇప్పుడు అదే దారిలో బ్రహ్మానందం కూడా ప్రయాణం పెట్టుకున్నారు. కమిడెయిన్ గా పూర్తి బిజీగా ఉన్న బ్రహ్మానందం తాజాగా గాయకుడుగానూ కనిపించబోతున్నాడు. రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం...అప్పలరాజు లో ఆయన ఓ పాట పాడారు. ఈ పాట బయిటకు వచ్చాక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇక బ్రహ్మానందం...రామ్ గోపాల్ వర్మ చిత్రాల్లో మనీ,అనగనగా ఒక రోజు,క్షణ క్షణం కామిడీలో ఓ ప్రత్యేకతను చూపుతూ వచ్చాయి. అలాగే సినిమా బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం తనదైన విలక్షతను చూపబోతున్నారు.

సినీ పరిశ్రమ బ్యాక్ గ్రౌండ్ లో రెడీ అవుతన్న ఈ చిత్రంలో సునీల్ ..అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా తీయటం కథాంశం. సినిమా తీయటం వ్యవసాయం చేసినంత ఈజీ అనకునే అతను ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తాడు..విజయం ఎట్లా సాధిస్తాడనేది కథ అని చెప్తున్నారు. వర్మ..కాంటాక్ట్ చిత్రంతో పరిచయమైన సాక్షి ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. అలాగే కలర్స్ స్వాతీ ఈ చిత్రంలో అసెస్టెంట్ డైరక్టర్ గా కనపడుతూ నవ్వులు పండించనుంది. సంక్రాంతి రోజు విడుదల అయ్యే ఈ చిత్రం కోసం వర్మ ఓ పాటను సైతం రాసారు. కోనేరు కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X