పవన్ పార్టీపై వర్మ చిత్రం

By Srikanya

హైదరాబాద్: జనాలు దేని గురించి మాట్లాడుకుంటూంటారో ఆ విషయాలను సబ్జెక్టు గా మార్చి సినిమాలు చేసి వార్తల్లో నిలవడం మొదటనుంచి వర్మ స్టాటజీ. తాజాగా ఆయన దృష్టి పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ 'జనసేన'పై పడిందని సినీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆయన ఓ కథ రెడీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గా ఎవరు నటిస్తారు అనేదే క్వచ్చిన్ గా మారిందని, అది తీరిపోతే సినిమా ఎనౌన్స్ చేసే అవకాసం ఉందంటున్నారు. అయితే వర్మ తరపు నుంచి ఈ విషయమై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

ఇక పవన్ ని టార్గెట్ చేస్తూ గత కొంతకాలంగా వర్మ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. ఆయన పార్టీ పెట్టాలని సైతం ఆయన చాలా సార్లు ట్విట్టర్ లో ప్రస్తావించారు. వర్మ ప్రార్ధనను, రిక్వెస్ట్ ని గణేషుడు ఆలకించాడా అంటే అవుననే అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ జోశ్యం చెప్పినట్లుగా చేసిన ట్వీట్స్ ఇప్పుడు నిజం అయ్యి అంతటా చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన పార్టీలో రావాలని ట్విట్టర్లో తెగ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు నిజం అయ్యింది. ఆయన గతంలో ఇదే విషయంపై వినాయిక చవితి రోజున ట్వీట్ చేసారు. అదేమిటంటే..

Ram Gopal Varma

వర్మ ట్వీట్ 'సాధారణంగా నేను దేవుడిని పూజించను. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ప్రార్థించక తప్పడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలి. అప్పుడే అన్ని సమస్యలు తీరుతాయి. నా కోరికను తీర్చు గణేషా' అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.

దాంతో వర్మ కోరికను పవన్ రూపంలో గణేషుడు తీర్చాడంటున్నారు. ఎప్పుడూ సందర్భాన్ని బట్టి సంచలన వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా రాజకీయాల్లోకి రానున్న పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఏ సంఘటన జరిగినా దానికి తగ్గట్టుగా వ్యాఖ్యానాలు చేసి సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ. గతంలో పవన్ కళ్యాణ్ ను బాలం థాకరేతో పోల్చి ఓబాల్ జనంలోకి వదిలిన రామ్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ ఎంజీఆర్, చిరంజీవుల కంటే డేర్ ఉన్న డైనమిక్ లీడర్ గా అభివర్ణిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X