నిజం..సునీల్ హీరోగా రామ్ గోపాల్ వర్మ చిత్రం
సునీల్ హీరోగా రామ్ గోపాల్ వర్మ ఓ క్రేజీ చిత్రం చేయబోతున్నారు.ఆ చిత్రం టైటిల్..కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అప్పలరాజు. ఫుల్ లెంగ్త్ కామిడీగా రన్ అయ్యే ఈ చిత్రంలో సునీల్ అమలాపురం నుంచి బయిలుదేరి ఫిల్మ్ నగర్ చేరి ఓ ఫిల్మ్ డైరక్టర్ అయ్యే విధానం ఉండబోతోందోంది. ఈ జర్ని అంతా హిలేరియస్ గా ఉంటుందని వర్మ చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత వర్మ తాను తెలుగులో చేయబోయే చిత్రం అని చెప్తున్నారు. రక్త చరిత్ర రిలీజ్ తర్వాత ఈ చిత్రం రిలీజ్ ఉండబోతోంది. ఇక ఫిల్మ్ డైరక్షన్ ఇంత ఈజీగా అనుకుని వచ్చే అప్పల రాజుకి ఫిల్మ్ ఫీల్డులో ఎదురయ్యే సవాళ్ళు,అవమానాలు నేపధ్యంలో ఈ కథనం నడుస్తుంది. తెలుగులో ఉండే కమిడియన్స్ అంతా ఈ చిత్రంలో నటించబోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే వర్మ...డైరక్ట్ గా సినీ పరిశ్రమని సెటైర్ చేయబోతున్నారన్నమాట. ఇక ఈ చిత్రం మొదలయ్యే నాటికి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మర్యాదరామన్న చిత్రం రిలీజవుతుంది. ఏదైమైనా సునీల్ హీరోగా చేయబోయే తన మూడో చిత్రానికే రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుడు చేతిలో పడటం లక్కే మరి.


Click it and Unblock the Notifications











