బాలకృష్ణకు షాక్ ఇవ్వనున్న RGV.. 16ఏళ్ళ క్రితం జరిగిన తుపాకి ఘటనపై సినిమా?

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెగ్యులర్ సినిమాలు తీసి బోర్ కొట్టేసిందో లేక ఆడియెన్స్ కి అలాంటివి నచ్చవు అనే ఆలోచనకు వచ్చారో తెలియదు గాని కమర్షియల్ గా మాత్రం రియల్ ఇన్సిడెంట్స్ ని క్యాష్ చేసుకోవాలని వర్మ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ ఆయన టార్గెట్ నందమూరి బాలకృష్ణ అని టాక్ వస్తోంది.

Recommended Video

RGV Next Movie On Balakrishna ఆ రాత్రి ఏం జరిగింది ? బాలకృష్ణ ఇంట్లో తుపాకి ఘటనపై RGV వర్మ సినిమా?
 లాభాలు అందుతున్నాయని..

లాభాలు అందుతున్నాయని..

ఓటీటీలో సినిమాలు క్లిక్ అవుతుండడంతో మంచి లాభాలు అందుతున్నాయని వర్మ లిమిట్స్ లేకుండా తన ఆలోచనలను ఆచరణలో పెడుతున్నాడు. గతంలో మాదిరిగా సెన్సార్ ఇబ్బందులు కూడా ఏ మాత్రం లేవు. థియేటర్స్ లేని సమయంలో వర్మ క్రియేట్ చేసుకున్న ఫ్లాట్ ఫార్మ్ బాగానే ఉపయోగపడుతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలను ఎనౌన్స్ చేస్తున్నాడు.

ఎలక్షన్స్ తరువాత..

ఎలక్షన్స్ తరువాత..

పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పవర్ స్టార్ సినిమాను రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. గడ్డి తింటావా అనే సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఎలక్షన్స్ తరువాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు అనే విషయాన్ని ఇందులో చూపించినట్లు తెలుస్తోంది. ఇక బండ్ల గణేష్, త్రివిక్రమ్, చంద్రబాబు.. అలాగే మెగాస్టార్ ని కూడా సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే పోస్టర్స్ ద్వారా చెప్పేశారు.

నెక్స్ట్ టార్గెట్ బాలయ్య..

నెక్స్ట్ టార్గెట్ బాలయ్య..

ఇక రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ టార్గెట్ బాలయ్య అని తెలుస్తోంది. 2004లో బాలకృష్ణ ఇంట్లో తుపాకి కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్మాత బెల్లంకొండ సురేష్ పై బాలయ్య గన్ తో కాల్పులు జరిపిన వార్తలు అప్పట్లో అందరిని షాక్ కి గురి చేశాయి. అయితే ఆ రాత్రి ఏం జరిగింది అనే అసలు విషయం పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.

ఆ రాత్రి ఏం జరిగింది?

ఆ రాత్రి ఏం జరిగింది?

తరువాత పలువురు ఆ ఘటనపై క్లారిటీ ఇచ్చినప్పటికీ అవి నిజాలు కావని అనుమానాలు వచ్చాయి. ఇక ఇప్పుడు వర్మ కన్ను ఆ ఘటనపై పడినట్లు తెలుస్తోంది. 'ఆ రాత్రి ఏం జరిగింది' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ పాత్ర కోసం ఒక క్యారెక్టర్ ని కూడా ఫిక్స్ చేశారనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే RGV క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X