twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: రామ్ గోపాల్ 'వర్మతో సరళా ఆంటీ'?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ....తెలుగు ప్రేక్షకుల మీదకు సినిమాల మీద సినిమాలు వదులుతున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఆయన దర్శకత్వంలో ఇప్పటికే రౌడీ, ఐస్ క్రీం, అనుక్షణం లాంటి సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో మరో రెండు సినిమాలు ‘పట్ట పగలు', ‘ఐస్ క్రీం-2' చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పాటు మోహన్ బాబు ఫ్యామిలీకి చెందిన బేనర్లో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు.

    కాగా...త్వరలో రామ్ గోపాల్ వర్మ సరికొత్త కాన్పెప్టుతో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌లో తన పేరు కూడా వచ్చేలా టైటిల్ డిజైన్ చేస్తున్నారట. ‘వర్మతో సరళా ఆంటీ' అనే టైటిల్‌లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. సరళ ఆంటీ పాత్రలో ఓ ప్రముఖ తార నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

     RGV next 'Varmatho Sarala Aunty'

    రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ‘ఐస్ క్రీం 2' సినిమా వివరాల్లోకి వెళితే...ఐస్ క్రీమ్' చిత్రాన్ని రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్‌తో ఒకే ఒక ఇంటిలో షూట్ చేసారు. కానీ ‘ఐస్ క్రీమ్-2'ను మొత్తం ఔట్ డోర్ లో పదహారు ప్రధాన పాత్రలతో తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం ఉండదు.

    జె.డి.చక్రవర్తి, నవీన, జీవా, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, శాలిని, గాయత్రి, రామ్ గుప్తా, ప్రభాకర్, బినోజి ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి పోస్టర్స్ డిజైన్: నవీన్ కళ్యాణ్-కాశి, ప్రెస్ రిలేషన్స్: ధీరజ అప్పాజీ, సౌండ్ డిజైన్: హరి, మ్యూజిక్: శ్రీరామ్, లిరిక్: సిరాశ్రీ, నిర్మాణ: తుమ్మలపల్లి రామ సత్య నారాయణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.

    English summary
    RGV is next coming up with an interesting project in Telugu, and it is ‘Varmatho Sarala Aunty’. He includes his name in the film’s tile.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X