అప్పుల పాలైన వర్మ? కావాలనే వివాదాలు, కేసులు?
హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భారీ మొత్తంలో అప్పుల పాలయ్యాడా? అంటే అవుననే వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. వర్మ అప్పులు దాదాపు 30 నుండి 35 కోట్ల మేర ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ముంబైలోనే ఉండే వర్మ అప్పులిచ్చిన వారి నుండి తప్పించుకు తిరిగడానికే హైదరాబాద్ వచ్చినట్లు చర్చించుకుంటున్నారు.
రామ్ గోపాల్ వర్మ తన వద్ద రూ.9 కోట్లు అప్పుగా తీసుకున్నాడని, అతను ఎక్కడున్నారో తెలియడం లేదని బాలీవుడ్ ఫైనాన్సియర్ భరత్ షా వ్యాఖ్యానించినట్లు ముంబైకి చెందిన ఆంగ్లపత్రికల్లో వార్త కథాలు వెలువడ్డాయి. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా వర్మ భారీగానే అప్పు పడినట్టు సమాచారం. తమ వద్ద రూ.32 కోట్ల మేర అప్పు తీసుకున్న వర్మ, ఇప్పటిదాకా కేవలం రూ.4 కోట్లు మాత్రమే చెల్లించారని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ సీఎఫ్ఓ శిబాసిష్ సర్కార్ చెప్పారు. వర్మ నుండి అప్పులు రాబట్టుకోవడానికి కోర్టును ఆశ్రయిస్తామని సర్కార్ అంటున్నారు.

మరో వైపు ముంబై అందేరిలోని తన ఆఫీసును కూడా వర్మ చాలా కాలంగా వాడటం లేదు. ముంబై నుండి హైదరాబాద్ షిప్ట్ అయ్యే ముందు ఆగస్టులోనే మళ్లీ వస్తానని అక్కడి వారికి చెప్పిన వర్మ.....మళ్లీ ముంబై ముఖం చుడలేదు. వర్మ ఇటీవల గణేష్ చతుర్థి సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు, అప్పుల అంశానికి లింక్ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వర్మ కావాలనే గణేష్ చతుర్థి సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని, తనపై కేసులు కావాలనే ఇలా చేసారని అంటున్నారు. తనపై కేసులు ఉన్నాయనే సాకుతో అప్పులు ఇచ్చిన వారి నుండి మరికొంత కాలం తప్పించుకుని తిరగొచ్చనేది అతి మాస్టర్‌గా ప్లాన్‌గా కనిపిస్తోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











