RGV : మరో బయోపిక్ మీద ఫోకస్.. సీక్రెట్ గా రెక్కీ.. వాళ్ళ కధేనా?
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ట్రెండీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్, అలాంటి ఆయన సినిమాలు అన్నీ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నాయి. ఒకప్పుడు వర్మ సినిమాల కోసం ఎదురు చూసిన వాళ్ళు సైతం అసలు వర్మ సినిమాలు వస్తున్నా పట్టించుకోని పరిస్థితి. కొన్నేళ్లుగా వర్మ తన రేంజ్‌కు తగ్గట్లుగా ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్న ఆయన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

మరో సినిమా మీద ఫోకస్
ఎక్కువగా బయోపిక్ లు మాత్రమే తీస్తున్న ఆయన ఆ కోవలో చేసిన వంగవీటి, కిల్లింగ్ వీరప్పన్, ఎటాక్ 26/11 లాంటి సినిమాలు పర్వాలేదనిపించాయి. అయితే ఇప్పుడు కొందరిని టార్గెట్ చేసి ఆయన చేస్తున్న సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో దెయ్యం అనే సినిమా ఆయన పేరు మీద రిలీజ్ చేశారు. స్వాతి దీక్షిత్, రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినా సరే ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేక పోయింది. అయితే వర్మ ప్రస్తుతం స్పార్క్ ఓటీటీని డెవలప్ చేసే పనిలో పడ్డారు.

రచ్చ రేపుతున్న బోల్డ్ ఫోటోలు
అయితే ఈ మధ్యకాలంలో వర్మ మరీ రొమాంటిక్ అయిపోతున్నాడు, కొద్ది రోజుల క్రితం యాంకర్ బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో జిమ్ లో ఇంటర్వ్యూ, తరువాత అషు రెడ్డితో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ ఆ తరువాత అప్సరా రాణి, సోఫియా నరేష్ లాంటి హీరోయిన్స్ తో అసభ్యకరమైన ఫోటోలు దిగి పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఆయన మరో బయోపిక్ మీద ద్రుష్టి పెట్టాడని అంటున్నారు.

మరో బయోపిక్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడు అనేది ఊహించడం కష్టం. ఎప్పటికప్పుడు తగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండే ఆయన ఇప్పుడు ఓ సినిమా కోసం వరంగల్ జిల్లాలో సీక్రెట్ గా పర్యటిస్తున్నారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పలువురి బయోపిక్ ల పేరుతో సంచలనం సృష్టించిన రాంగోపాల్ వర్మ, మరో బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నట్లుగా మీడియా వర్గాల సమాచారం.

ఎల్బీ కళాశాలలో సీక్రెట్ పర్యటన
ఇక ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారని, ఈ రోజు వరంగల్ లోని ఎల్బీ కళాశాలలో అధ్యాపకులను, సిబ్బందిని కలిసి కొంతసేపు రహస్యంగా చర్చించారని అంటున్నారు. ఎల్బీ కళాశాలకు సంబంధించిన అనేక అంశాలను వర్మ అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. ఎల్బీ కళాశాల ప్రిన్సిపాల్ డీహెచ్ అరుణరావుతో సమావేశమై అనేక విషయాలను వర్మ చర్చించారని, ఆ తరువాత ఆయన కళాశాల అంతా సందర్శించారని అంటున్నారు.
Recommended Video

కొండా సురేఖ-మురళి
వరంగల్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పి ఇప్పుడు కొంచెం సైలెంట్ అయిన కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ ఆమె భర్త మురళిల బయోపిక్ వర్మ ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే వారు ఎల్బీ కళాశాలలోనే చదువుకున్నారు, అక్కడే ప్రేమలో పది వివాహం చేసుకున్నారని అంటున్నారు. అయితే ఇది ప్రచారమే కాగా ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక అదే కనుక నిజమైతే ఈ బయోపిక్ మళ్ళీ ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











