‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పోస్టర్లో చంద్రబాబు... మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నంలో వర్మ?

రామ్ గోపాల్ వర్మ తన తాజా సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా వర్మ మరోసారి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

By Bojja Kumar

Recommended Video

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పోస్టర్లో ట్విస్ట్ ఇదే...

టాలీవుడ్లో వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.... ఎవరికీ ఒక్క పట్టాన అర్థంకాడు. ఆయన మాట్లాడే విషయాలు, సోషల్ మీడియాలో చేసే పోస్టులు, తన సినిమాల్లో చూపించే అంశాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి.

మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితంలోని ఓ వివాదాస్పద అధ్యాయాన్ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమాగా తెరకెక్కించే పనిలో ఉన్న వర్మ.... ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

వివాదం ముసుగులో పబ్లిసిటీ

వివాదం ముసుగులో పబ్లిసిటీ

వర్మకు వివాదాలు అంటే చాలా ఇష్టం. అందుకే ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మీ పార్వతి ఎపిసోడ్‌ను వివాదాస్పదం చేసి సినిమాలో చూపించేందుకు వర్మ ఆసక్తి చూపుతున్నట్లు చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన ఎవరిని రెచ్చగొట్టాలో వారిని బాగా రెచ్చగొడుతున్నాడని ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు.

వర్మ అనుకున్నట్లే వారు రెచ్చిపోయారు

వర్మ అనుకున్నట్లే వారు రెచ్చిపోయారు

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత నుండి, ఎన్టీఆర్ జీవితం చివరి వరకు జరిగిన పరిణామాల్లో అత్యంత వివాదాస్పదుడుగా చంద్రబాబు నాయుడు ఉన్నారనే ప్రచారం ఉంది. దీన్ని ఫోకస్ చేస్తూ వర్మ పోస్టులు చేయడం, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం లాంటివి జరిగాయి. వర్మ అనుకున్నట్లు వారు రెచ్చిపోవడంతో.... తనదైన రీతిలో వారికి కౌంటర్లు ఇస్తూ వర్మ ఆనందం పొందడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం.

మళ్లీ రెచ్చగొట్టేందుకేనా? ఈ ఫోస్టర్

మళ్లీ రెచ్చగొట్టేందుకేనా? ఈ ఫోస్టర్

వర్మ తాజాగా తన ‘ఫేస్ బుక్' ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘హరిణి తన అద్భుత అవగాహనతో, సృజనాత్మకతతో, అసాధారణ రీతిలో రూపొందించిన అల్ట్రా అల్టీమేట్ ఇమేజ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది' అని ఆ ట్వీట్ లో వర్మ వ్యాఖ్యానించారు. నాడు చంద్రబాబునాయుడు, భువనేశ్వరి వివాహ వేడుకలో ఎన్టీఆర్ దంపతులు ఉన్న ఈ ఫొటోలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ కొత్త పోస్టర్ మాదిరిగా ఉంది. ఇలా చేయడం ద్వారా తన సినిమాలో చంద్రబాబు పాత్ర ఉంటుందని మరోసారి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం వర్మ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏ మాత్రం తగ్గని వర్మ

ఏ మాత్రం తగ్గని వర్మ

ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ సందర్భంలో స్పందించారు. లక్ష్మి'స్ ఎన్టీఆర్‌లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు, ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు కామెంట్లకు వర్మ వెంటనే సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు గారన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే..కాని లక్ష్మి'స్ ఎన్టీఆర్ సినిమాలో నేను ఆ పుస్తకం లోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను... అంటూ వర్మ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X