రామ్ గోపాల్ వర్మపై మండిపడుతున్న రవితేజ?
అసలే 'దొంగల ముఠా" ఫ్లాప్ అయి తనకున్న క్రేజ్ ను కాస్తా గంగలో కలిపేసిందని భాధపడుతున్న రవితేజకు ఇప్పుడో కొత్త తలనొప్పి స్టార్టయింది. అదీ రామ్ గోపాల్ వర్మ మూలంగానే కావటం విశేషం. సినిమా ప్రమోషన్ కోసం వర్మ సలహాపై ప్రెస్ మీట్‌లో హీరో రవితేజ 'దొంగల ముఠా" లాంటి కథతో ఎవరొచ్చినా హ్యాపీగా 'రెమ్యూనరేషన్" తీసుకోకుండా నటిస్తానని చెప్పుకొచ్చాడు. దాంతో రవితేజతో చిత్రం తియ్యాలంటే ఇదే సరైన టైమ్ అంటూ చాలా మంది అమెచ్యూర్ డైరక్టర్స్ మా దగ్గర అలాంటి కథలున్నాయంటూ రవితేజ వెంటబడటం ప్రారంభించారు. వారిని ఏమన్నా అంటే మీడియాకెక్కి ఇచ్చిన మాట తప్పారంటూ గొడవ...అలాగని వారికి సమాధానం చెప్పలేక మరో సమస్య. వారంతా రాంగోపాల్ వర్మ అయితేనే నటిస్తావా అంటూ సూటిగా ప్రశ్నించటంతో ఏం చెప్పాలో అర్దంకాని ఎదురవుతోందని చెప్తున్నారు. దాంతో ఈ తలనొప్పిని తన తలకి పనిమాలా ఎక్కించిన వర్మని తిట్టుకుంటూ తన నెక్ట్స్ ప్రాజెక్టు వీరలో బిజీ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











