పోస్టర్ ఖర్చులైనా వస్తాయా?

By Srikanya

హైదరాబాద్ : క్వాలిటీ అనేది పట్టించుకోవటం మానేసి,కేవలం క్వాంటిటీ మీదే దృష్టి పెడుతూ,వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా మరో చిత్రం ఎనౌన్స్ చేసి పారేసారు. 'ఐస్‌క్రీమ్' టైటిల్ తో రూపొందే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేసారు. అంతేగాక ఈ చిత్రానికి సంభందించి కొన్ని ఫస్ట్ లుక్ ఫొటోలను విడుదల చేసాడు. అయితే వీటిని చూసినవారు పెదవి విరుస్తున్నారు. అసలే నవదీప్ సినిమాకు మినిమం ఓపినింగ్స్ లేవు. దానికి తోడు శాటిలైట్ సినిమాలు తీసుకునే నిర్మాత రామ సత్యనారాయణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయటం. వర్మ వేగంగా చుట్టేయటం చూస్తూంటే పోస్టర్ ఖర్చులైనా ఈ చిత్రానికి దక్కుతాయా అని సందేహపడుతున్నారు.

RGV 's 'Ice cream' to be released on July 4th

విభిన్న కథాంశాలతోనే కాకుండా డిఫరెంట్ టైటిల్స్‌తో సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం 'ఐస్‌క్రీమ్'. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవదీప్ హీరో. తేజస్వి హీరోయిన్. సైలెంట్‌గా రెండు నెలల క్రితం ఈ చిత్రాన్ని ప్రారంభించిన వర్మ నాన్‌స్టాప్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేసి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే నెల 4న సినిమా విడుదల చేయడానికి నిర్మాత రామసత్యనారాయణ సన్నాహాలు చేస్తున్నారు.

టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'ఐస్‌క్రీమ్' చిత్రానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. తన మొదటి సినిమా 'శివ'తో స్టడీకామ్ కెమెరాను పరిచయం చేసిన రాము తాజాగా ఈ చిత్రంలో ఫ్లోకామ్ అనే కెమెరాను ఉపయోగించారు. దీనిని ఆసియాలోనే తొలిసారిగా ఉపయోగించిన దర్శకుడు వర్మ అని చెప్పాలి. ఫ్లోకామ్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X