మొగడు మీద అనుమానం అంటున్న రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ త్వరలో మొగుడు మీద అనుమానం అనే చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం శ్రీదేవి ని హీరోయిన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. మొగుడు,పెళ్ళాల మధ్య పెరిగిపోయే అనుమానం కథతో ఈ చిత్రం రూపొందనుంది, ఈ చిత్రం కాన్సెప్ట్ ను వర్మ ..శ్రేదేవి వద్ద ప్రపోజల్ పెట్టి ఓకే చేయించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. శ్రీదేవి హిందీలో అమితాబ్ సరసన ఓ చిత్రం చేయటానకి ఓకే చేసిన నేఫద్యంలో వర్మ ఈ ప్రపోజల్ ని పెడ్తున్నారు. ఇక వర్మ ఇప్పటికే పూరి జగన్నాధ్, హరీష్ శంకర్ లతో కలిసి పెళ్ళి అనే చిత్రం రూపొందిస్తున్నారు. ఇక తెలుగులో శ్రీదేవి నటించటం అనేది మంచి క్రేజ్ తెచ్చి పెట్టే విషయమే. అందులో వర్మ దర్శకత్వంలో ఆమె గోవిందా గోవిందా, క్షణం క్షణం చిత్రాల తర్వాత చేయలేదు. మొన్న కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు ఓపినింగ్ కి ఆమెను పిలిచారు.
రామ్ గోపాల్ వర్మ మొగుడు మీద అనుమానం పెళ్ళి పూరీ జగన్నాధ్ ram gopal varma mogudi meeda anumanam pelli puri jagannath


Click it and Unblock the Notifications