బరితెగించిన భామతో వర్మ సినిమా

By Bojja Kumar

మోడల్ పూనమ్ పాండే గుర్తుందా? పబ్లిసిటీ కోసం బరితెగింపు పోకడలకు పోతున్న ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ భామ దేశం మొత్తం ముక్కున వేలేసుకునేలా ఈ మధ్య తెగ రెచ్చి పోతోంది. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్న ప్రదర్శన ఇస్తానంటూ ఆ మధ్య సంచలన ప్రకటన చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే మాట మాత్రం నిలబెట్టుకోలేదనుకోండి. నిన్న గాక మొన్న వరుస ఓటములు చవిచూస్తున్న టీమిండియాను ఉత్తేజ పరచడానికంటూ ట్విట్టర్ లో తన అర్ధనగ్న ఫోటోలను పెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో పూనమ్ పాండే పై కన్నేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ధోనీ సేన, క్రికెటర్ లవర్స్, పూనమ్ పాండేను దృష్టిలో పెట్టుకుని ఓ కథను తయారు చేసుకున్న రామూజీ...ఇటీవల జరిగిన పలు యదార్థ ఘటనలను తన స్ర్కిప్టులో ఇరికించినట్లు తెలుస్తోంది. నగ్న ప్రదర్శన ఇస్తానంటూ పూనమ్ పాండే చేసిన ప్రకటన లాంటి రియల్ సీన్స్ ఇందులో ఉంటాయట. అదే సమయంలో వరల్డ్ కప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై పరాజయం పాలైన పలు అంశాలు, కారణాలు ఇందులో వర్మ ప్రస్తావించనున్నాడని సమాచారం. ఏది ఏమైనా....రియల్ స్టోరీలకు కొన్ని కల్పితాలను కలిపి ఆసక్తికరంగా సినిమాలను తెరకెక్కించే వర్మ తాజాగా క్రికెటర్లపై ప్రయోగాత్మక సినిమా తీయబోతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X