రామ్ గోపాల్ వర్మ 'పెళ్ళి' చిత్రంలో హీరో ఎవరంటే...

By Srikanya

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం పెళ్ళి లో హీరో ఎవరనేది ఇప్పటివరకూ ప్రకటించని సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోగా బి.వి.యస్ రవి చేస్తున్నట్లు తెలుస్తోంది. రవి ఇంతకు ముందు గోపీచంద్ హీరోగా వాంటెడ్ చిత్రంని డైరక్ట్ చేసారు. డిజాస్టర్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం తర్వాత అతను వేరే ట్రైల్స్ లో ఉన్నాడు. అయితే వర్మ పిలిచి అతనికి ఈ చిత్రం ద్వారా హీరోగా చేసాడని చెప్తున్నారు. గతంలోనూ రవి కొన్ని చిత్రాల్లో నటించారు. ఇక పెళ్ళి చిత్రాన్ని వర్మతో పాటు హరీష్ శంకర్,పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తున్నారు.

ఇక పెళ్ళి చిత్రంలో కథ... ఒక వ్యక్తి ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ అతనికి పెళ్లి అనే వ్యవస్థ మీద వివిధ కారణాల వల్ల విభిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆ కారణాలకు కారణం పెళ్లి చేసుకున్న మూడు జంటలు, పెళ్లి వల్ల వాళ్లు ఎదుర్కొన్న మానసిక స్థితులు ఆ వ్యక్తికి తెలియడమే. అలాంటి నేపథ్యంలో అతను తన పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయిం తీసుకున్నడన్నదే మిగతా కథ
ఈ మూడు జంటలకు సంబంధించిన మూడు కథల్ని రాంగోపాల్ వర్మ, పూరిజగన్నాథ్, హరీష్‌శంకర్ తమ శైలిలో రచించి తెరపై ప్రజెంట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత.

ఈ మూడు జంటలు సినిమాలో ఒకరికొకరు ఎదురుపడరు. వారి మధ్య పరిచయమే ఉండదు. అయితే నాలుగో కథలోని వ్యక్తి మాత్రం ఈ మూడు కథల్లో కామన్ కేరెక్టర్.ఆ కామన్ క్యారెక్టరే బి.వియస్ రవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X