నిధి అగర్వాల్‌తో రామ్ గోపాల్ వర్మ ప్లానింగ్.. వర్కవుటయ్యేనా..?

యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో బాగా ఫోకస్ అవుతోంది. గతంలో అక్కినేని సోదరులు నాగచైతన్య, అఖిల్ లతో వరుసగా ''సవ్యసాచి, మిస్టర్ మజ్ను'' సినిమాలు చేసిన ఆమె తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన చేరి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆడిపాడింది. షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచే ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్న చిత్రయూనిట్ నిధి అందాలను ఫుల్లుగా హైలైట్ చేసేసింది. ఈ మేరకు నిధి గ్లామర్ షోతో కిక్కిచ్చే ట్రైలర్ రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ చూసిన రామ్ గోపాల్ వర్మ వెంటనే ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ నిధి అందాలను తెగ పొగిడేశారు. ట్రైలర్ బాగుందని కితాబిచ్చారు. మరోవైపు ఇప్పటికే వర్మ సినిమాల్లో రంగీలా అంటే తనకెంతో ఇష్టమని పేర్కొంది నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో నిధి పర్‌ఫార్‌మెన్స్‌కి తన దర్శకత్వ పదును జోడించి రంగీలా 2 రూపొందించాలని రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Rgvs Rangeela 2 with Nidhhi Agerwal?

గత 24 ఏళ్ల క్రిందట అనగా 1995 వ సంవత్సరంలో 'రంగీలా' మూవీ యూత్ ఆడియన్స్ లో ఎంత జోష్ నింపిందో అందరికీ తెలుసు. యాయిరే.. యాయిరే అంటూ ఈ సినిమాతో ఊర్మిళ చూపిన పర్‌ఫార్‌మెన్స్‌ ఇప్పటికీ ప్రేక్షకులను రంజింపజేస్తుంది. అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరో ఉన్నా ఈ సినిమాలో ఊర్మలనే బాగా హైలెట్ అయ్యింది. ఇక రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు.

అయితే రంగీలా అంతటి సెన్సేషన్ ఇప్పుడు మరోసారి క్రియేట్ చేయాలనే ఆలోచనలో పడ్డ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా సీక్వల్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. పైగా ఇందులో నిధి అగర్వాల్ అయితే బాగా సూట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే వర్మ టేకింగ్ లో నిధి అందాలు సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమే! చూడాలి మరి ఈ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా? రంగీలా 2 ప్లాన్ వర్కవుటవుతుందా? అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X