మహేష్ బాబు మీద వర్మ సెటైర్ ??
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...సంపూర్ణేష్ బాబు ని హీరోగా పెట్టి ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం టైటిల్ "పోకిరి రిటర్న్స్'. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. దాంతో ఇది మహేష్ బాబు స్పూఫ్ గా చేస్తున్న చిత్రమా అని సందేహాలు మొదలయ్యాయి.
ఇక సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం విషయానికి వస్తే...
హృదయ కాలేయం చిత్రంతో పరిచయమైన సంపూర్ణేష్‌బాబు హీరో గా మరో సినిమా కమిటయ్యారయిన సంగతి తెలిసిందే. సింగం 123 టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. తమిళ హిట్ సింగం కి స్పూఫ్ లా ఉంటుందని వినికిడి. ఈ చిత్రం విషయమై మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు...కొబ్బరి మట్ట అనే చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే...సంపూర్ణేష్ బాబు హీరోగా... వైరస్ డాట్ కామ్ అనే పేరుతో ఓ వినూత్న చిత్రం తెరకెక్కుతోంది. (బి వేర్) అనేది ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రానికి సీ.హెచ్. శివరామకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎన్ ఫిల్మ్స్ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది.
కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.


Click it and Unblock the Notifications











