twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బెజవాడ' డైరక్టర్ పై వర్మ సీరియస్

    By Srikanya
    |

    నాగచైతన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న చిత్రం 'బెజవాడ'. నాగచైతన్య గత చిత్రం దడ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో వర్మకు నాగార్జున ఈ సినిమాని జాగ్రత్తగా చేసి హిట్ కొట్టి తన కొడుకుని యాక్షన్ హీరోగా నిలబెట్టాల్సిన భాధ్యత నీదేనని హెచ్చరించాడట. దాంతో వర్మ ఇప్పుడు పూర్తిగా బెజవాడ పైనే దృష్టి పెట్టి మొత్తం రషెష్ చూసి చాలా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. తను అనుకున్న ఇంటెన్సిటీ కథలో రాలేదని వర్మ దర్శకుడు వివేక్ కృష్ణ పై సీరియస్ అయినట్లు ఫిల్మ్ సర్కిల్సో వినపడుతోంది. దాంతో తానే కొన్ని సీన్స్ రీషూట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. దాంతో అక్టోబర్ 21 న దీపావళికి విడుదల చేద్దామనుకుంటున్న బెజవాడ నవంబర్ మొదటి వారానికి వాయిదా పడినట్లు సమాచారం. దానికి కారణం కొన్ని సీన్స్ రీషూట్ చేయాలనుకోవటమే కారణం అని తెలుస్తోంది.

    ''దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు దర్శకుడు వివేక్‌కృష్ణ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెజవాడ'. నాగచైతన్య, అమలాపాల్‌ జంటగా నటిస్తున్నారు. రామ్‌గోపాల్‌ వర్మ, కిరణ్‌కుమార్‌ కోనేరు నిర్మాతలు.

    English summary
    Dissatisfaction of Varma expressed to Director Vivek on the outcome of 'Bezawada' movie till now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X