వర్మ‘షాక్’ సినిమాలు చూడటం కంటే నేత్ర దానం చేయడమే బెటర్..
ఎవరి వెర్రి వాళ్ళ కానందం అని పెద్దలు ఉరికే అనలేదు. ఆ రోజుల్లో కూడా మన రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళు ఉండనే ఉంటారు గనుక, అలా తీర్మానించేసి ఉంటారు. నేనసలే కొంచెం మెంటల్ అని గర్వంగా చెప్పుకొంటూ బోర విరుచుకు తిరిగే రామ్ గోపాల్ వర్మ, ఆ సంగతిని మనమెక్కడ మరిచిపోతామోనని బెంగ పెట్టుకొని తరచూ తన ట్వీటార్ ద్వారా ఏదో రూపంగా మనందరికీ గుర్తు చేస్తూనే ఉంటాడు.
ప్రముఖ హీరో చిరంజీవి నేత్ర దానం చేయమని ప్రచారం చేస్తుంటే రామ్ గోపాల్ వర్మ నేత్ర దానానికి వ్యతిరేకంగా ట్విట్టర్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. బహుశా వర్మగారు తన కళ్ళతో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఈ స్టేట్ మెంట్ చిరంజీవికి వ్యతిరేకంగా అవ్వచ్చు, కాకపోవచ్చు. కాని నేత్ర దానం చేయాలనుకునే వాళ్ళను మాత్రం భయపెట్టేలా ఉంది ఈ స్టేట్ మెంట్. అది ఏంటంటే'నేను ఎప్పటికీ నా కళ్ళును డొనేట్ చెయ్యను ఎందుకంటే నాకు ఒక సందేహం ఉంది ఎవరైతే 'గత జన్మలో నేత్ర దానం చేసినవాళ్ళు ఈ జన్మలో అంధులుగా పుట్టి ఉంటారని తన అభిప్రాయమాట'. అందుకే నేను నేత్రదానం చేయనంటున్నాడు. దానికి చాలా మంది ఫ్యాన్స్ రకరకాలు గా వర్మగారిని ప్రశ్నించారు. అందులో ఒకతను ప్లీస్ వర్మగారు, మీరు ఇలాంటి వాటిని పోస్ట్ చేయకండి ఎందుకంటే మీ ఫ్యాన్స్ చాలా డిస్ అప్పాయింట్ అవుతారన్నారు. మరొకతను తను తీసే ఘోరమైన సినిమాలు చూడటం కంటే నేత్ర దానం చేయడమే బెటర్ అని ఈ విషయం పై రాము సినిమా భాదితులు అనుకుంటున్నారు.
రీసెంట్ గా భార్య కోసం రావణుడిపై వ్యక్తిగత యుద్ధం చేసిన శ్రీరాముడు దేవుడెలా అవుతాడని ప్రశ్నించిన ప్రముఖ దర్శక నిర్మాత రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశారు. హిందువులు తమ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడిని విలన్‌గా చూపిస్తూ ఆయన సినిమా తీయడానికి ఇష్టపడుతున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











