చేతిలో వోడ్కా బాటిల్, నోటితో జై ‘పవర్ స్టార్’.. క్లైమాక్స్‌లో ఆర్జీవీ ఎంట్రీ!

ఆర్జీవీ తన సినిమాలను ప్రమోట్ చేసుకునే విధానం అందరికీ తెలిసిందే. కథను ఎంచుకునే దగ్గరి నుంచి దాన్ని జనాల వద్దకు తీసుకెళ్లే వరకు ప్రతీ దాంట్లో కొత్త పద్దతినే ఎంచుకుంటాడు. ఈ మధ్య ఆర్జీవీ పవర్ స్టార్ మూవీతో కుస్తీ పడుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కాలంలోనే వరుసగా చిత్రాలను రిలీజ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న వర్మ.. 'పవర్ స్టార్'తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి ఎన్నో అనుమానాలను రేకెత్తించాడు.

 ట్రైలర్‌కు రేటు..

ట్రైలర్‌కు రేటు..

ప్రపంచ సినీ చరిత్రలో మొట్టమొదటి సారిగా ట్రైలర్‌కు రేటు పెట్టి అందర్నీ విస్మయానికి గురి చేశాడు. రూ. 25 పెడితేనే ట్రైలర్ చూడవచ్చని ప్రకటించం ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే అది కూడా ప్రమోషన్‌లో స్ట్రాటజీయే అని అందరూ అనుకున్నారు. చివరగా వర్మకే షాక్ తగిలింది.

ట్రైలర్ లీక్..

ట్రైలర్ లీక్..

వర్మ అలా డబ్బులు పెట్టి ట్రైలర్ రిలీజ్ చేద్దామనుకున్నాడు. కానీ ముందుగానే ట్రైలర్ లీక్ అవ్వడంతో ఎవరి డబ్బులు వారికి ఇస్తానని ప్రకటించాడు. దీంతో ఆ ట్రైలర్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే అలా డబ్బులు పెట్టడం, ఇలా లీక్ అవ్వడం, మళ్లీ డబ్బులు వాపస్ ఇస్తాను అని అనడం అంతా కూడా స్ట్రాటజీయే అని కొందరు అంటున్నారు.

 అందర్నీ వాడేశాడు..

అందర్నీ వాడేశాడు..

పవర్ స్టార్ ట్రైలర్‌ను ఒకసారి గమనిస్తే అందులో అందర్నీ వాడేశాడు. బండ్ల గణేష్, త్రివిక్రమ్, అన్నాలెజినోవా, చిరంజీవి, చంద్రబాబు వంటి వారిని పోలిన పాత్రలను పెట్టేశాడు. ఇవన్నీ అందరూ ఊహించనవే అయినా చివర్లో ఓ వ్యక్తి రావడం, అతనెవరనేది క్లియర్ చూపించకపోవడం వెనుక పెద్ద కథే ఉందని టాక్.

వోడ్కా బాటిల్‌తో రచ్చ..

వోడ్కా బాటిల్‌తో రచ్చ..

ట్రైలర్ చివర్లో వచ్చిన వ్యక్తి కేవలం వోడ్కా బాటిల్‌ను మాత్రమే సింబల్‌గా చూపించాడు. అయితే ఈ వోడ్కా అనేది వర్మకు ప్రతిరూపంగానే అని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తాను కూడా పవర్ స్టార్‌లో ప్రత్యేక పాత్రను పోషిస్తున్నానని చెప్పకనే చెప్పాడని అంటున్నారు.

Recommended Video

Parannageevi First Song | ఈ పాట RGV గనక వింటే అంతే సంగతి
 క్లైమాక్స్ అదే..

క్లైమాక్స్ అదే..

ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రవన్ కళ్యాణ్ అనే ఫిల్మ్ స్టార్‌కు వీరాభిమైన సదరు వ్యక్తి.. వోడ్కా బాటిల్‌తో అతని వద్దకు వెళ్లి ఓదార్చుతాడని, ఓటమికి గల కారణాలు చెప్పి బాధ నుంచి బయట పడేస్తాడని తెలుస్తోంది. చివర్లో జై పవర్ స్టార్ అని స్లోగన్ చేస్తాడని టాక్. మరి నిజంగా క్లైమాక్స్ ఇలానే ఉంటుందా? లేదా? అన్నది ఇంకో రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X