RGV ఆలోచనలో ప్రజారాజ్యం, ఉదయ్ కిరణ్, బాలయ్య కథలు.. తెలివిగా సెట్ చేసిన టైటిల్స్?
పవర్ స్టార్ సినిమాతో రామ్ గోపాల్ వర్మ లాభాలు ఏ స్థాయిలో అందుకున్నాడో గాని తన RGV వరల్డ్ థియేటర్ కి మాత్రం మంచి హైప్ క్రియేట్ చేశాడు. చాలా వరకు వర్మ చేసిన ప్రమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ కూడా డిజిటల్ వరల్డ్ లో తన పట్టు సాధించడానికి వర్మ సరికొత్త కాంట్రవర్సీ కథలను సెలెక్ట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో బాలయ్య, ప్రజారాజ్యం, ఉదయ్ కిరణ్ కి సంబంధించిన కథలు ఉన్నట్లు తెలుస్తోంది.

పదునైన స్టోరీలు రెడీ
పవర్ స్టార్ సినిమాతో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన వర్మ నెక్స్ట్ మిర్యాలగూడ పరువు హత్యపై సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వర్మ ఆ సినిమాతో కూడా కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఆయన ఆలోచనలో పవర్ స్టార్ కాన్సెప్ట్ మాదిరిగా వివాదాలు సృష్టించడానికి పదునైన స్టోరీలను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రజారాజ్యం కాదు బావరాజ్యం
పవర్ స్టార్ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులనే కాకుండా దాదాపు మెగా అభిమానులందరికి కొంత ఆగ్రహం తెప్పించిన వర్మ నెక్స్ట్ మెగాస్టార్ కి సంబంధించిన రాజకీయ కోణాన్ని కూడా చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో అల్లు అరవింద్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ప్రజారాజ్యం పార్టీలో ఆయన ఎలాంటి పాత్ర పోషించారు అనే కాన్సెప్ట్ తో బావ రాజ్యం అనే సినిమా చేస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి.

ఉదయ్ కిరణ్ పై కూడా..
తెలుగు చిత్ర పరిశ్రమలో అందరిని షాక్ కి గురిచేసిన ఘటనలలో ఉదయ్ కిరణ్ సూసైడ్ ఇన్సిడెంట్ ఒకటి. అతని మరణం వెనుక అసలు వాస్తవాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయని చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే ఉదయ్ కిరణ్ సూసైడ్ స్టోరీపై కూడా వర్మ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు హృదయ్ కిరణ్ అని టైటిల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ తుపాకి కాల్పులపై..
అప్పట్లో బాలకృష్ణ, నిర్మాత బెల్లంకొండ సురేష్ పై తుపాకితో కాల్పులు జరిపిన ఘటనపై కూడా వర్మ ఫోకస్ పెట్టినట్లు గత కొన్ని రోజుకుగా రూమర్స్ వస్తున్నాయి. ఆ రాత్రి ఏం జరిగింది అనే టైటిల్ తో సినిమా కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్
Recommended Video

చట్టపరమైన కేసుల్లో ఇరుక్కోకుండా..
మొత్తంగా వర్మ చట్టపరమైన కేసుల్లో ఇరుక్కోకుండా చాలా తెలివిగా సినిమా టైటిల్స్ ని సెట్ చేసుకుంటున్నాడు. అలాగే పాత్రల పేర్లను కూడా నిజమైన వ్యక్తుల పేర్లకు దగ్గరగా ఉండేలా సెట్ చేసుకుంటున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా వర్మ డిజిటల్ వరల్డ్ లో సరికొత్త వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. టైమ్ లిమిట్స్, సెన్సార్ వంటి టెన్షన్స్ లేవు కాబట్టి అనుకున్న పాయింట్స్ ని అనుకున్నట్లుగా ప్లాన్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నాడు. మరి భవిష్యత్తులో ఇంకెలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











