తెలుగు డైరెక్టర్స్‌కు బాలీవుడ్ భామ ఫోన్లు.. ఒక్క ఛాన్స్ ప్లీజ్!

ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవ్వడం అనే సామెత ఎక్కువగా వ్యాపారంలో వినిపిస్తూ ఉంటుంది. కానీ సినిమా రంగంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి. అవకాశాలు వచ్చినప్పుడు పట్టించుకోరు అవకాశం ఇచ్చే వాళ్ళు లేనప్పుడు మాత్రం వెంటపడి మరీ అవకాశాల కోసం ఆరాట పడుతుంటారు కొందరు నటీనటులు. ఇదే కోవలో తాజాగా ఒక బాలీవుడ్ భామ అవకాశాల కోసం టాలీవుడ్ దర్శకులకు వరుసగా ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ భామ మరెవరో కాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు హీరోయిన్ రియా చక్రవర్తి.

అరెస్ట్ కావడంతో

అరెస్ట్ కావడంతో

తెలుగులో అంతకుముందు ఈ భామ ఒక సినిమా చేసింది. అయితే ఆ సినిమా చేసినా గుర్తింపు రాలేదు కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతితో ఈమె పేరు మార్మోగిపోయింది. నిజంగా ఆయన మృతికి ఆమె కారణం అవునో కాదో తెలియదు కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఈమె మీద చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. డ్రగ్స్ కేసులో ఆమె ఏకంగా అరెస్టు అయి నెలకు పైగా కారాగారవాసం కూడా చేసి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు సన్నగిల్లాయి. సినిమాల్లో నటించాలని చూస్తున్నా బాలీవుడ్లో ఆమె తీసుకునేవారిలో కరువయ్యారు..

మకాం మార్చే పనిలో

మకాం మార్చే పనిలో

తెలుగులో తూనీగ తూనీగ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తో ఒక సినిమా ఒప్పుకుంది. ఆ సినిమా ఒప్పుకున్నా సరే సరిగ్గా షూటింగ్ కి రాకుండా ఆమె ఎక్కువగా ముంబైలోనే గడుపుతూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించి మేకర్స్ వేరే హీరోయిన్ ని చూసుకున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఆమెకు అసలు అవకాశాలు దక్కక పోతున్న కారణంగా ఆమె టాలీవుడ్ కి మకాం మార్చే పనిలో ఉందని తెలుస్తోంది.

ఇక్కడ ఆఫర్స్ వద్దనుకుని అక్కడికి

ఇక్కడ ఆఫర్స్ వద్దనుకుని అక్కడికి

నిజానికి ఇక్కడ ఆమెకు ఆఫర్లు వస్తున్న సమయంలో ఇక్కడి నుంచి బాలీవుడ్ కి మకాం మార్చి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలి హోదాలో ఒకరకంగా ఆయనకు అనధికార మేనేజర్ గా వ్యవహరిస్తూ ఉండేది. సుశాంత్ రికమండేషన్ వల్ల కొన్ని సినిమా అవకాశాలు దక్కించుకుని హీరోయిన్గా చేయడానికి ప్రయత్నాలు చేసేది. అయితే ఆయన మృతితో మొత్తం బాలీవుడ్ కెరీర్ నాశనం అయిపొయింది. ఇక ఈమెకు అవకాశం ఇస్తే బాలీవుడ్లో తమ సినిమాలను ప్రజలు ఆదరించరు ఏమో అన్న భయంతో చాలామంది ఈమెకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
రకుల్ అండతో

రకుల్ అండతో


ఈ నేపథ్యంలో ఆమె తనకు పరిచయం ఉన్న దాదాపు అందరు తెలుగు దర్శకులకు వరుసపెట్టి ఆమె ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. ఆమెకు రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్నేహితురాలు కావడంతో ఆమె సహాయంతో దాదాపు తెలుగు దర్శకులు అందరితో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. లీడ్ రోల్ కాకపోయినా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఉన్నా సరే తాను చేస్తానని తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు సమాచారం. ఒక్క ఛాన్స్ ఇస్తే తనను తాను ప్రూవ్ చేసుకుంటా అని ఆమె దర్శక నిర్మాతలను ప్రాధేయ పడుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశం ఏమైనా ఇస్తారేమో ?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X