Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగా అల్లుడికి హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌ను సెట్ చేశారా?
మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.... గతేడాది 'విజేత' అనే సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే కళ్యాణ్ దేవ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకవడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.
'విజేత' సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.రిజ్వాన్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ తెరకెక్కించబోయే ఈ చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహించబోతున్నారు.
రియా చక్రవర్తి
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఎంపికైనట్లు తెలుస్తోంది. రియా చక్రవర్తి తెలుగు మూవీ ‘తూనీగా తూనీగా'తో హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టింది. తర్వాత బాలీవుడ్లో చిత్రాలు హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబీ చిత్రాల్లో నటించింది. కళ్యాణ్ దేవ్ చిత్రంలో రియా దాదాపుగా ఖరారైనట్లే అని టాక్.
బోల్డ్‌గా నటించే తెగింపు ఉన్న నటి
రియా చక్రవర్తి బోల్డ్‌గా నటించే తెగింపు ఉన్న నటి. ముద్దు సీన్లు సైతం చేయడానికి పెద్దగా మొహమాట పడని అమ్మాయి. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అయినప్పటికీ మెగా అల్లుడి సినిమాలో అలాంటి సీన్లు ఉంటాయో లేదో క్లారిటీ లేదు.
త్వరలో షూటింగ్
కళ్యాణ్ దేవ్ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందించబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కళ్యాణ్ దేవ్ రెండో మూవీ
కళ్యాణ్ దేవ్, రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి సాంకేతిక నిపుణులు : దర్శకుడు: పులి వాసు, నిర్మాత: రిజ్వాన్, బ్యానర్: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, సహ నిర్మాత: ఖుర్షీద్, సంగీతం: ఎస్ఎస్ తమన్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, సహ దర్శకులు: డి. రాజేంద్ర, రవి, సాహిత్యం: కేకే, ప్రొడక్షన్ కంట్రోలర్: రషీద్ అహ్మద్ ఖాన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాజు.