రానా తో రిలేషనే ఆమెకు వెంకటేష్ ప్రక్కన ఛాన్స్ ఇప్పించింది
కెరీర్ పూర్తిగా ప్రారంభంకాకముందే ప్లే బోయ్ గా పేరుతెచ్చుక్న యంగ్ హీరో దగ్గుపాటి రానా.తనతో పాటు లీడర్ లో నటించిన రిచా గంగోపాధ్యాయకి అతను తెలుగు పరిశ్రమలో లైఫ్ ఇస్తానని ప్రామిస్ చేసాట్ట.అందుకుతగినట్లే తన బాబాయ్ చిత్రం నాగవల్లిలో ఛాన్స్ ఇప్పించాడు.ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ సరసనే బాడీగార్డ్ రీమేక్ లో ఛాన్స్ ఇప్పించాడు.
'నాగవల్లి"లో టైటిల్ పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ వెంకటేష్ తో నటించే ఈ చిత్రంలో పూర్తిభిన్నంగా హాట్ హాట్‌గా గ్లామరస్ పాత్రలో కనిపిస్తారని చెప్తున్నారు. వెంకటేష్, త్రిష జంటగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు.ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రం సెంటిమెంట్,కామిడీ సమపాళ్ళలో ఉన్న యాక్షన్ చిత్రం అని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











