టీవీ నటిని పెళ్లాడనున్న టీం ఇండియా క్రికెటర్ ? ఇద్దరి మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా?
టీం ఇండియా క్రికెటర్ ఓ టీవి నటిని పెళ్లాడబోతున్నాడు అనే వార్త గత కొద్దీ గంటలుగా నెట్టింట్లో దుమారం క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ విషయంపై నటి క్లారిటీ ఇచ్చింది. మరి ఏ క్రికెటర్ ఏ టీవి నటుడిని పెళ్లబోతోంది అనే రూమర్స్ వైరల్ అయ్యాయి? వాళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
భారత స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన వృత్తిపరమైన జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలిచాడు. తాజాగా నటి రిద్ధిమా పండిట్‌తో శుభ్‌మాన్ పెళ్లి చేసుకోబోతున్నాడనే పుకార్లు ఊపందుకున్నాయి. దీనిపై రిద్ధిమా మౌనం వీడింది. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

టీవీ నటి రిధిమా పండిట్ , టీం ఇండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పెళ్లి చేసుకోబోతున్నారనే గాలి వార్తను ఎవరు మొదట లీక్ చేశారో తెలియదు. అయితే దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరి వివాహం డిసెంబర్ 2024లో జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరంగా వీరిద్దరి మధ్య వయసు గ్యాప్ 9 ఏళ్లు. రిధిమాకు 33 ఏళ్లు. శుభ్‌మన్ వయసు 24 ఏళ్లు. ఈ పెళ్లి రూమర్‌పై రిధిమా స్వయంగా క్లారిటీ ఇచ్చింది.
'నేను పొద్దున్నే లేవగానే జర్నలిస్టుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నా పెళ్లి గురించి ఒక ప్రశ్న అడిగారు. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమైన సంఘటన జరిగితే నేనే ప్రకటిస్తాను. ఇప్పుడు ప్రచారంలో ఉన్న దాంట్లో నిజం లేదు' అని రిధిమా అన్నారు.

రిధిమా పండిట్ క్లారిటీతో శుభమాన్ గిల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం ఏంటంటే మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ డేటింగ్ చేస్తున్నట్టు ఆల్రెడీ రూమర్లు ఉన్నాయి. దీంతో సడన్ గా టీవి నటితో శుభమాన్ పెళ్లి అనేసరికి ఆయన అభిమానులు టెన్షన్ పడ్డారు. అయితే వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ప్రకటించలేదు.
శుభ్‌మన్ పేరు ఇలా చర్చనీయాంశం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రష్మిక మందన్నపై నాకు క్రష్ ఉంది అని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఆ ప్రకటనను ఖండించారు. అలాగే ప్రముఖ నటి సారా అలీ ఖాన్‌తో కూడా శుభ్‌మాన్ గిల్ రిలేషన్ లో ఉన్నట్టు రూమర్లు చక్కర్లు కొట్టాయి.


Click it and Unblock the Notifications











