రింగ రింగ పాపతో ముమైత్ ఖాన్ కు ముప్పు!?
ఆర్య 2 చిత్రంలో రింగ రింగ పాటలో కనిపించి అలరించిన ఎరీనాకు తెలుగులో మంచి ఆపర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు వరకూ ముమైత్ ని మెచ్చుకుని తమ సినిమాల్లో ఐటం సాంగ్స్ ఆఫర్ చేసిన వారంతా ఎరీనా వైపు షిప్ట్ అయిపోతున్నారు. అందులోనూ ముమైత్ హవా ఈ మధ్య పూర్తిగా తగ్గిపోయింది. ఆమె ఐటం సాంగ్స్ వర్కవుట్ కావటం లేదు..ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలూ హిట్టవలేదు. దాంతో ఆమె వైపుకు చూసే వారే కరువు అయ్యారు. అందులోనూ ముమైత్ కూడా కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని తన బాడీని షేప్ అప్ చేసుకుని వద్దామనే నిర్ణయానకి వచ్చి శెలవులో ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో ఆర్య 2 సినిమా ఎలా ఉన్నా రింగా రింగా పాట హిట్టవటంతో అందరి దృష్ఠీ అందులో నటించిన ఎరీనాపై పడింది. అందులోనూ ఆమె కూడా తెలుగులో సెటిల్ అవ్వాలనే ఉద్దేశ్యంతో రేటుకు ప్రాధాన్యత లేదని క్లియర్ గా చెప్తోందని వినికిడి. ఇక ముమైత్ అయితే ఫ్రత్యేకమైన ప్యాకేజీ ఉంది. అందులోనూ మమైత్ అందాలు మొహం మొత్తాయని కొందరు దర్శకులు ఫీలవుతున్నారు. ఆమెను రెగ్యులర్ గా ఎంకరేజ్ చేసే పూరీ సైతం గోలీమార్ చిత్రంలో ఐటం సాంగ్ కు నమితను తీసుకోవటాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











