twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR యూనిట్‌కు షాక్: ముందే లీక్ అయిన టైటిల్.. తెలుగులో అలా అర్థం వచ్చేలా ప్లాన్.!

    By Manoj
    |

    భారీ తారాగణం.. హై టెక్నికల్ వ్యాల్యూస్.. అత్యధిక బడ్జెట్‌‌తో తెరకెక్కుతున్న చిత్రం RRR. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన 'బాహుబలి' సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండడానికి తోడు ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే, తరచూ ఈ మూవీ గురించి వస్తున్న వార్తలతో అవి రెట్టింపు అయ్యాయి. ఉగాదిని పురస్కరించుకుని చిత్ర టైటిల్ రివీల్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అది కాస్త ముందుగానే లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం.!

    RRR వాళ్లిద్దరి కథ.. వీళ్లందరూ కలిశారు

    RRR వాళ్లిద్దరి కథ.. వీళ్లందరూ కలిశారు

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీంగా కనిపించనున్నారు. ఆ ఇద్దరు రియల్ హీరోల కథతోనే ఈ మూవీ రూపొందుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్, సముద్రఖని సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు.

     ఊహించని కష్టాలు.. అందుకే ఈ ఫలితం

    ఊహించని కష్టాలు.. అందుకే ఈ ఫలితం

    RRR రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర అవుతోంది. అయినప్పటికీ ఈ మూవీ షూటింగ్ డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది. దీనికి కారణం.. ఇందులో నటించే హీరోలు గాయపడడం.. ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వంటివి ఉన్నాయి. వీటికి తోడు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం కూడా చాలా వరకు ఉంది.

    మాట తప్పిన జక్కన్న.. వాళ్లంతా ఆగ్రహం

    మాట తప్పిన జక్కన్న.. వాళ్లంతా ఆగ్రహం

    మెగా, నందమూరి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం RRR. ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే, దానికి ఇప్పుడు జనవరి 8, 2021కి మార్చారు. దీనికితోడు ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఒక్కటంటే ఒక్క సర్‌ప్రైజ్ కూడా రాకపోవడంతో వాళ్లంతా జక్కన్నపై ఫైర్ అవుతున్నారు.

    ఉగాదికి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన RRR యూనిట్‌

    ఉగాదికి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన RRR యూనిట్‌

    ప్రస్తుతం షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది అయినా అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉగాది పండుగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే RRRకు క్యాప్షన్‌గా పెట్టే టైటిల్‌ను మధ్యాహ్నం 12 గంటలకు రివీల్ చేయనున్నారు. మొత్తం ఐదు భాషల్లో ఐదుగురు విడుదల చేస్తారు.

    Recommended Video

    RRR Motion Poster : Megastar Chiranjeevi, RGV Reacts On RRR Title & RRR Motion Poster
    యూనిట్‌కు షాక్: ముందే లీక్ అయిన టైటిల్

    యూనిట్‌కు షాక్: ముందే లీక్ అయిన టైటిల్

    ఉగాది పండుగకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చిందని అందరూ ఆనందపడుతున్న సమయంలో ఓ ఊహించని పరిణామం జరిగింది. బుధవారం రివీల్ కానున్న టైటిల్ ముందే లీక్ అయింది. దీని ప్రకారం.. RRRకు ‘రైజ్ రివోల్ట్ రివేంజ్' అనేది క్యాప్షన్‌గా పెట్టబోతున్నారు. సినిమా రూపొందుతున్న తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మలయాళంలో ఇదే టైటిల్ ఉండబోతుందని సమాచారం.

    తెలుగులో అలా అర్థం వచ్చేలా ప్లాన్.!

    తెలుగులో అలా అర్థం వచ్చేలా ప్లాన్.!

    ‘రైజ్ రివోల్ట్ రివేంజ్' దాదాపుగా ఫిక్స్ చేశారని ముందు నుంచే వార్తలు వస్తున్నాయి. దీనికి తెలుగులో ‘నిలబడు.. తిరుగుబాటు చెయ్.. పగ తీర్చుకో' అనే అర్థం వస్తుందని అంటున్నారు. అలాగే, మిగిలిన భాషల్లోనూ అదే మీనింగ్ వస్తుంది కాబట్టే దీన్ని ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. సర్‌ప్రైజ్ ఇద్దామనుకుంటే ముందే లీక్ అవడంతో చిత్ర యూనిట్ షాక్ అవుతోందని టాక్.

    English summary
    Tollywood Young Hero Jr Ntr Upcoming Movie Is RRR. This Movie Directed By SS Rajamouli. In This Movie mega power Star Ram charan Also Working. In This Movie Will be Released on 8th July 2021. Dvv Danayya Producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X