జై హనుమాన్‌లో కంతారా హీరో.. రిషబ్ శెట్టికి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?

Jai Hanuman: యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Verma) కాంబినేషన్‌లో వచ్చిన బాక్ట్ బస్టర్ మూవీ 'హనుమాన్' (Hanuman). ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ గా 'జై హనుమాన్'(Jai Hanuman) అనే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలకు పెంచేలా, ఈ మూవీ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపేలా మరో న్యూస్ వైరలవుతోంది. అదే.. జై హనుమాన్ మూవీలో హనుమంతుడు పాత్రలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? అతని భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు టాక్. ఈ విశేషాలేంటో ఓ లూక్కేయండి.

తేజా సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'హనుమాన్‌'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. గతంలోని పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఎవ్వరి అంచనాలకు అందని విధంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.350 కోట్లు వసూళ్లు రాబట్టి యంగ్ హీరో తేజ కెరీర్ లో అల్ టైం హిట్ గా నిలిచింది. ఇంతకీ భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ గా 'జై హనుమాన్'(Jai Hanuman) అనే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Rishab Shetty on board of Jai Hanuman Here is Kantara actor s whopping Remuneration details

ఈ సీక్వెల్ మూవీపై అంచనాలు పెంచేలా.. ఈ మూవీ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపేలా మరో న్యూస్ వైరలవుతోంది. ఇప్పటికే ఈ సిక్వెల్ మూవీలో స్టార్ హీరోస్ నటించబోతున్నారనే వార్తలు ఈ మూవీపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగవైరలవుతోంది. అదే.. 'జై హనుమాన్' (Jai Hanuman) మూవీలో ప్రధాన పాత్ర అయినా హనుమంతుడు (Hanuman)
క్యారెక్టర్ గురించి.. ఈ క్యారెక్టర్‌కు కోసం ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, రానా దగ్గబాటిలతో చర్చించినట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరైనా ఒకరు ఈ పాత్రలో నటించబోతున్నారనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే.

అయితే.. తాజా అప్డేట్ ప్రకారం.. 'జై హనుమాన్' (Jai Hanuman)లో హనుమంతుడు పాత్రలో కన్నడ స్టార్ హీరోను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు.. 'కాంతార' మూవీ హీరో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty). ఈ పాత్ర కోసం మూవీ మేకర్స్ రిషబ్ శెట్టిని సంప్రదించగా.. ఆ దేవుడిపై ఉన్న భక్తితో ఆ క్యారెక్టర్ ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే.. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది.

Rishab Shetty on board of Jai Hanuman Here is Kantara actor s whopping Remuneration details

జైహనుమాన్ లో ప్రధాన పాత్ర కోసం.. రిషబ్ శెట్టి భారీ మొత్తంతో డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ పాత్రలో నటించడానికి రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్, మరియు లాభాలలో 50% వాటా డిమాండ్ చేశారట. అయితే.. జై హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి మాత్రం కండీషన్స్ కు ఒప్పుకోలేదంట. కానీ, మైత్రి మేకర్స్ అతని డిమాండ్‌లకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X