Rishabh Shetty: రిషబ్ శెట్టికి కోట్ల ఆఫర్.. జై హనుమాన్ పారితోషికం డీల్‌లో ట్విస్ట్!

Rishab Shetty Remuneration For Jai Hanuman Movie: మైథలాజికల్ యూనివర్స్‌లో సంచలనం సృష్టించిన మూవీ హనుమాన్ (HanuMan). ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న మూవీ 'జై హనుమాన్'. ప్రశాంత్ వర్మ - యంగ్ హీరో తేజ సజ్జా కాంబోలో రాబోతున్న మూవీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. 2024 సంక్రాంతికి విడుదలైన మొదటి భాగం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు పెరిగాయి.

ఇటీవల హంపీలోని అంజనాద్రిలో ఘనంగా పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. దీంతో రోజుకో అప్డేట్ వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగింది.ఈ సీక్వెల్‌లో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ( Rishab Shetty) హనుమంతుడి పాత్రలో కనిపించనుండటం ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఆయన రెమ్యునరేషన్ డీల్‌పై పడింది.

Rishab Shetty Remuneration for Jai Hanuman Rs 20 Cr Profit Share or Rs 80 Cr Fixed Deal

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ విషయంలో రెండు ఆప్షన్స్ ఇవ్వబడినట్లు తెలుస్తోంది. మొదటి ఆప్షన్ ప్రకారం, రూ.20 కోట్ల పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో 33 శాతం వాటా పొందే అవకాశం ఉంది. రెండో ఆప్షన్‌గా, సినిమా హిట్-ఫ్లాప్‌తో సంబంధం లేకుండా రూ.80 కోట్ల ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా స్టార్ హీరోలు సేఫ్ సైడ్‌గా ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్‌ను ఎంచుకుంటారు. అయితే ఈ విషయంలో రిషబ్ శెట్టి మాత్రం రిస్క్ తీసుకునేలా కనిపిస్తున్నారు.

ఫిలింనగర్ టాక్ ప్రకారం.. రిషబ్ శెట్టి మొదటి ఆప్షన్ అంటే తక్కువ రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఆయనలో ఉన్నట్లు ఇది సూచిస్తోంది. మరోవైపు నిర్మాతలు మాత్రం రూ.80 కోట్ల ఫిక్స్‌డ్ పేమెంట్ ఇవ్వడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవాలని భావిస్తున్నారట. దీంతో హీరో-నిర్మాతల మధ్య ఈ డీల్‌పై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఈ డీల్‌కు సంబంధించిన ఫైనల్ నిర్ణయం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్న తేజ సజ్జా కూడా తన పారితోషికాన్ని పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. హనుమాన్, మిరాయ్ వంటి హిట్స్ తర్వాత ఆయన పాన్ ఇండియా హీరోగా ఎదగడంతో, ఈ సీక్వెల్ కోసం రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది ప్రాజెక్ట్ భారీ స్థాయిని మరింత స్పష్టం చేస్తోంది. ఇక సినిమా కథ విషయంలో కూడా ఆసక్తికరమైన అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో చూపించిన మైథలాజికల్ టచ్‌ను మరింత విస్తరించి, కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్లు సమాచారం.

హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి, హనుమంత్ పాత్రలో తేజ సజ్జా కొనసాగుతారని టాక్. అలాగే మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో తేజ సజ్జాతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని వంటి నటులు కీలక పాత్రల్లో నటించి సినిమాకు బలాన్ని ఇచ్చారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

'జై హనుమాన్' మూవీ కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు.. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (Prasanth Varma Cinematic Universe) లో కీలక ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, మైథలాజికల్ ఎలిమెంట్స్ అన్ని కలిసి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలనంగా మారే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X