నీ భార్య మూడోసారి ప్రెగ్నెంటా? నెటిజన్ తింగరి ప్రశ్నకు హీరో దిమ్మతిరిగే జవాబు

తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ పాపులారిటీని సాధించిన ముంబై భామ జెనిలియా దేశ్‌ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్ కుమారుడు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకొన్నది తెలిసిందే. రితేష్‌తో ఇప్పటికే ఇద్దరు పిల్లలకు జెనీలియా జన్మనిచ్చింది. అయితే సోషల్ మీడియాలో జెనీలియా మూడో సారి గర్బం దాల్చిందనే విషయం వైరల్ అవుతున్నది. ఇన్స్‌టాగ్రామ్‌లో రితేష్‌ను ఓ నెటిజన్ నీ శ్రీమతి గర్బవతా? అని అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. రితేష్ ఇచ్చిన జవాబు వివరాల్లోకి వెళితే..

జెనీలియా డిసౌజా తెలుగులో ఘన విజయం సాధించిన నువ్వే కావాలి సినిమా రీమేక్‌ తుజే మేరీ కసమ్ సినిమా ద్వారా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తమిళంలో బాయ్స్, తెలుగులో రెడీ, బొమ్మరిల్లు, ఆరెంజ్, సై, సాంబా, హ్యాపీ తదితర సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకొన్నది. కెరీర్ గ్రాఫ్ టాప్‌లో ఉండగానే.. రితేష్ దేశ్‌ముఖ్‌ను 2012లో వివాహం చేసుకొన్నారు.

Riteish Deshmukh befitting reply to Netizens Question over Genelia Deshmukh 3rd Pregnancy

రితేష్‌తో పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్‌కు జెనీలియా పరిమితయ్యారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే అడపాదడపా సినిమాల్లో నటిస్తూ భర్తకు సహాయంగా ఉంటున్నారు. అప్పుడప్పుడ తెలుగు సినిమాలో రంగంలో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నది. అలాగే ఏవైనా తెలుగు సినిమా కార్యక్రమాలకు కూడా హాజరవుతూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల ముంబైలో రితేష్, జెనీలియా ఇద్దరు ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరైన సమయంలో చాలా లూజ్ ఉండే డ్రస్సును ధరించింది. పొట్ట భాగం కనిపించకుండా జాగ్రత్త పడుతూ కనిపించింది. దాంతో జెనీలియా మరోసారి ప్రెగ్నెంట్ అయ్యారా? అనే అనుమానాలు తలెత్తాయి. దాంతో సోషల్ మీడియాలో జెనీలియా మూడోసారి ప్రెగ్నెంట్ అనే వార్త వైరల్ అయింది.

Riteish Deshmukh befitting reply to Netizens Question over Genelia Deshmukh 3rd Pregnancy

దాంతో రితేష్‌ను ఓ నెటిజన్.. జెనీలియా మూడోసారి ప్రెగ్నెంటా? అని ప్రశ్నించాడు. దాంతో రితేష్ తనదైన శైలిలో స్పందించాడు. జెనీలియా మరో రెండు సార్లు, మూడు సార్లు ప్రెగ్నెంట్ అయినా నాకు ఇబ్బంది లేదు. కానీ దురదృష్టం కొద్ది రూమర్లన్నీ అవాస్తవాలే అని రితేష్ హ్యూమర్‌గా జవాబిచ్చాడు.

రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా 2012 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. 2014లో రియాన్‌కు రితేష్, జెనీలియా జన్మనిచ్చారు. రెండో కుమారుడు రైహిల్‌కు 2016లో జన్మను ప్రసాదించారు. రితేష్, జెనీలియా ఇద్దరు కలిసి ఇటీవల తెలుగు చిత్రం మజిలీ ఆధారంగా రూపొందిన వేద్ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా 10 కోట్లతో నిర్మిస్తే.. 73 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X