వచ్చే ఫిబ్రవరి 4న జెనీలియా పెళ్లి?
బబ్లీ గర్ల్ జెనీలియా బాలీవుడనటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన రితేష్ దేశ్‌ముఖ్‌తో గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు కూడా. విశ్వసనీయంగా అందిన సమాచారం 2012 ఫిబ్రవరి 4న జెనీలియా పెళ్లి ఉంటుందని సమాచారం. ముంబై మిర్రర్ అనే పత్రికలో వెల్లడైన వివరాల ప్రకారం....ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించారని, ఫిబ్రవరి 3,4,5 తేదీల్లో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగాలని జెనీలియా డిసైడైనట్లు బాలీవుడ్ టాక్. ఇందుకు ఆమె కాబోయే మొగుడు రితేష్ , రితేష్ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని సమాచారం. వీరి పెళ్లికి సినిమా రంగంలోని అత్యంత సన్నిహితులు, ఇరుకుటుంబాలకు చెందిన శ్రేయోబిలాషులు, రాజకీయ నాయకులు మాత్రమే ఆహ్వానం ఉంటుందని తెలుస్తోంది. సినీ రంగం నుంచి రితేష్ తరుపున కరణ్ జోహార్, బోమన్ ఇరానీ, సాజిద్ ఖాన్, రామ్ గోపాల్ వర్మ, బచ్చన్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం ఉంటుందని, జెనీలియా తరుపున ఇప్పటి వరకు ఆమె నటించిన బాలీవుడ్ హీరోలతో పాటు, దక్షిణాది నుంచి ఆమెతో స్క్రీన్ పంచుకున్న హీరోలు సిద్దార్థ, రాణా తదితరులకు ఆహ్వానం ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











