జెనీలియా-రితేష్ లు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారా...!?
బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్, జెన్నీల ప్రేమాయణం మనకు తెలిసిందే. అయితే, ఈమధ్య వీరిద్దరూ కలిసి ముంబైలో ఓ పాష్ ఏరియాలోని ఫ్లాట్ లో సహజీవనం సాగిస్తున్నారన్నది వార్త. ఇదే విషయాన్నిఈమె వద్ద ప్రస్తావిస్తే, 'ఇవన్నీ నేనంటే గిట్టని వాళ్లు చేస్తున్న విషప్రచారం. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. అయినా, సహజీవనం చేసేంతగా నేను దిగజారలేదు" అంటూ విసుక్కుంది. అంటే, సహజీవనం చేసే వాళ్లు మీ దృష్టిలో దిగజారినట్టా? అనడిగితే, కంగారుపడుతూ కంగుతింది జెన్నీ. 'నా ఉద్దేశం అది కాదు. నా వరకు నేను చెప్పానంతే" అంటూ సవరించిన విషయం తెలిసిందే.
గత కొద్దిరోజుల క్రితం జెనీలియా రహస్యంగా పెళ్ళి చేసుకున్నట్లు తమిళ పత్రికల్లో వార్తలు గుప్పుమన్నాయి. పెద్దలు అంగీకరించకపోవడంతో రితేష్, జెనీలియాలు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన కొందరు ప్రముఖులు వీరి పెళ్లికి హాజరైనట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయాన్ని జెనీలియా ఖండించింది. ఇదిలావుండగా రితేష్ దేశ్ ఫ్యామిలీ జెనీలియా పెళ్ళికి అంగీకరించారిని వీరి పెళ్లి వచ్చే సంవత్సరం 2012లో ఉంటుందని, అయితే వీరి పెళ్ళి మహరాష్ట్ర సాంప్రదాయపద్దతులతోనా, రితేష్ ఫ్యామిలి ప్రకారం క్యాథలిక్ సాంప్రదాయంలో చర్చిలో పెళ్ళినా లేదా రెండు పద్దతులోనూ చెసుకుంటారా అనేది తెలియాల్సి వుంది..


Click it and Unblock the Notifications











