twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రోబో' కన్నారావు తల పట్టుకు కూర్చున్నాడా?

    By Srikanya
    |

    దాదాపు 27 కోట్లు పెట్టి రజనీకాంత్ తాజా చిత్రం "రోబో" తెలుగు రైట్స్ తీసుకున్న నిర్మాతగా తోట కన్నారావు ఆ మద్య ఒక్కసారిగా హైలెట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తోట కన్నారావు మాయ చరిత్ర ఇది అంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిని ఆయన ఛాలెంజ్ చేస్తూ శక్తానుసారం ఖండించారు కూడా. అయితే ఇప్పుడాయన మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆయన కధ రజనీకాంత్ అరుణా చలం సినిమాని గుర్తు చేస్తుందంటూ ఆయన జిల్లాలో వినపిస్తోంది. అక్కడివారు చెప్పుకునే దాని ప్రకారం...రోబో ని ఇరవై ఏడు కోట్లకి కొనటం ద్వారా ఆయన తన బ్లాక్ డబ్బుని వైట్ చేసుకుందామనుకున్నారని, అయితే రోబో ఘన విజయం సాధించటంతో అంతకు అంత డబ్బు రెట్టింపై ఆయన వద్దకు చేరింది. దాంతో ఆయన ఇప్పుడు తలపట్టుకు కూర్చున్నాడని చెప్తున్నారు.

    ఇక ఆయన కొద్ది రోజుల క్రితం మీడియాలో ఆయనపై వచ్చిన ఆరోపణలను త్రిప్పి కొట్టే ప్రయత్నం చేసారు. 1988లో తాను పది లక్షల రూపాయలకు ఐపి పెట్టానన్న విషయం అవాస్తవమన్నారు. దమ్ముంటే ధైర్యంగా ఎదురుగా వచ్చి తనను ఎదుర్కోమని ఆయన అన్నారు. అలాగే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. తాను ఏడాదికి మూడు కోట్ల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ తాను ఎవరికీ రూపాయి కూడా ఎగ్గొట్టలేదన్నారు. "రోబో" చిత్రానికి పదిహేను కోట్లు అమ్మకపు పన్ను, ఐదు కోట్లు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక తూర్పు గోదావరి జిల్లా "రోబో" చిత్రం డిస్ట్రిబ్యూటర్ చల్లా శంకరరావు మాట్లాడుతూ...తోట కన్నారావు లాంటి గొప్ప వ్యక్తికి గ్రామస్తులు అంతా కలిసి భారీ ఎత్తున సన్మాన కార్యక్రమాలు చేయాలని సూచించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X