ఈ డైరక్టర్ ని మించిన వారు లేరన్నది ఈ సినిమా విడుదలతో తెలిసిపోతుంది....!
'జీన్స్" సినిమాతో ఇండియన్ సినిమా స్ర్కీన్ పై కొత్త టెక్నీలజీని ఇంట్రడ్యూస్ చేసిన ఘనుడంటూ శంకర్ ని పొగడ్తలతో ముంచెత్తేస్తోంది బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్. భారతదేశం గర్వంచదగ్గ దర్శకులు...అంటూ ఓ ఐదుగురి పేర్లను తీస్తే, అందులో శంకర్ పేరు ఖచ్చితంగా వుంటుందని ఐష్ చెప్పుకొచ్చింది ఓ ఇంటర్వ్యూలో.
'జీన్స్" సినిమాలో నటించేటప్పటికి తనకు దక్షిణాది సినీ పరిశ్రమతో పెద్దగా సంబంధాల్లేవనీ, ఇప్పడు దక్షిణాదిన తాను ఓ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నానంటే అది శంకర్ పుణ్యమేనని చెబుతోంది ఐష్. శంకర్ కోసమే 'రోబో" సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాననీ, భారతీయ సినిమా తెరపై 'రోబో" ఓ టెక్కికల్ వండర్ అవుతుందని ఐష్ అంటోంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా టెక్నాలజిని అడాప్ట్ చేసుకోవడంలో శంకర్ ని మించిన వారెవరూ లేరని 'రోబో" తో ప్రూవ్ అవుతుందని ఐష్ సినిమా ప్రమోషన్ ని అదరగొట్టేస్తోంది.


Click it and Unblock the Notifications











