అల్లరి నరేష్..'సేల్స్ మెన్ ఆప్ ది ఇయిర్'?

By Srikanya

అల్లరి నరేష్ త్వరలో రీసెంట్ బాలీవుడ్ రిలీజ్ రాకెట్ సింగ్..సేల్స్ మెన్ ఆఫ్ ది ఇయిర్ చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మధ్యనే ఈ చిత్రాన్ని చూసిన నరేష్ తనతో సినిమా చేయాలని తిరుగుతున్న ఒకరిద్దరు నిర్మాతలకు ఈ చిత్రం చూడమని సజెస్టు చేసాడని తెలుస్తోంది. దాంతో మరో ఉత్సాహవంతుడైన సీనియర్ కో డైరక్టర్ ఈ చిత్రం కథను తన వెర్షన్ లో వండేసి మరీ స్క్రిప్టుతో అల్లరి నరేష్ వద్ద వాలిపోయారుట. సినిమాను ఔట్ అండ్ ఔట్ కామిడీగా చేద్దామని హామీ ఇస్తున్నాడుట. యష్ రాజ్ ఫిల్మ్ వారు నిర్మించిన ఈ చిత్రం ఓ సేల్స్ మెన్ జీవితం డాక్యుమెంటేషన్ చేసినట్లుగా క్యారెక్టర్ డ్రైవన్ ప్లాట్ తో నడుస్తుంది.

ఈ రాకెట్ సింగ్ చిత్ర కథ హర్ప్రీత్ సింగ్ బేడి (రణబీర్) అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది.అతను డిగ్రీ పూర్తి చేసి ఏవైఎస్ అన్న కంపెనీలో సేల్స్ మెన్ గా చేరతాడు. అది అసెంబుల్డ్ కంప్యూటర్స్ అమ్మే కంపేనీ. అక్కడ కామన్ గానే ఎన్నో రాజకీయాలు, అవినీతి ఉంటాయి. దాంతో టార్గెట్లు సాధించలేక బాస్ చేత తిట్లు తింటూ, సాటి సేల్స్ మేన్స్ చేత కాగితపు రాకెట్లు వేయించుకుంటూ అవమానించబడుతూంటాడు. ఇలా జరుగుతూండగా ఏం చేయాలో అర్దంకాని స్దితిలో రిసెప్షనిస్ట్ ఇచ్చిన సహకారంతో ఓ కష్టమర్ గురించి తెలుసుకుని సొంతంగా “రాకెట్ సేల్స్ కార్పోరేషన్" స్ధాపిస్తాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే ఆ కష్టమర్ కి మాల్ సప్లై చేస్తాడు. అలా ఎదుగుతూ తను పనిచేస్తున్న కంపెనీకే పోటీగా తయారవుతాడు. అలాంటి పరిస్ధితుల్లో ఆ కంపెనీ ఏం నిర్ణయం తీసుకుంది..అతని కెరీర్ ఎలా సాగిందనే పాయింటుతో స్టైయిట్ గా కథనం సాగుతుంది.

చక్ దే ఇండియా, అబ్ తక్ చప్పన్ వంటి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు షిమిత్ అమిన్ ఈ “రాకెట్ సింగ్ - సేల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్" చిత్రం రూపొందించాడు. అలాగే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రణబీర్ కపూర్ హీరో కావటంతో మంచి ఓపినింగ్సే వచ్చాయి. అయితే చిత్రం క్రిటికల్ గా ఎక్లైమ్ అయినా కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. మరి అల్లరి నరేష తో ఈ చిత్రం అంటే డైలాగ్ కామిడీగా మార్చాల్సిందే కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X