రాణా మొదటి బాలీవుడ్ సినిమానే వివాదంలో ఇరుక్కుపోయింది...
రోహన్ సిప్పీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అభిషేక్, టాలీవుడ్ యంగ్ హీరో లీడర్ రాణా నటించిన తొలి హిందీ చిత్రం 'దం మారో దం' విడుదలకు ముందే ఓ వివాదంలో చిక్కుకుంటోంది. ఆ సినిమా ట్రైలర్స్ లో హీరోయిన్ బిపాషా బసు పలికిన ఓ డైలాగు కుర్రాళ్లకు కిక్కిస్తున్నప్పటికీ, గోవా ప్రజలకు మాత్రం సర్రుమని కాలుతోంది. గోవా బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్స్ చిత్రీకరించారని 'ఇక్కడ మందు చీప్... అమ్మాయిలు మరింత చీప్' అంటూ బిపాషా పలికే ఆ డైలాగు తమను, తమ ప్రాంతాన్నీ అవమానపరిచేదిగా వుందని గోవా ప్రజలు గొడవ చేస్తున్నారు. తమ రాష్ట్రానికి వచ్చి షూటింగులు చేసుకుని, చివరికి తమనే విమర్శిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ డైలాగులు సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదలకు సిద్దమవుతోన్న సందర్బంలో ఈ వివాదం చివరికి ఏమవుతుందో? వేచి చూడాల్పిందే...
abhishek bachchan rana bipasha basu deepika padukone బిపాసా బసు రాణా అభిషేక్ బచ్చన్ దీపికా పదుకొనే కంగనా రౌనత్ రోహన్ సిప్పి


Click it and Unblock the Notifications