Roja కూతురికి హీరోయిన్ గా ఛాన్స్.. స్టార్ హీరో వారసుడితో గ్రాండ్ ఎంట్రీ?
సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీగా ఇవ్వడం అనేది సర్వసాధారణ విషయం. అయితే ఆ రూట్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ అయితే లేదు. టాలెంట్ తో పాటు ఇక్కడ కాస్త అదృష్టం ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు అని చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకుల వారసులు కూడా అప్పుడప్పుడు సినిమా వెండితెరపై కొనసాగుతూ ఉన్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ ga ఎంతగానో క్రేజ్ అందుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. జెక్క్ ఆమె కూతురు ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అగ్ర హీరోలతో..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజెస్ ను సంపాదించుకున్న రోజా నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక చిన్న స్థాయి హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆమె ఆ తర్వాత తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరితోను సినిమాలు చేశారు. అలాగే తమిళం మలయాళం ఇండస్ట్రీలో కూడా అగ్ర హీరోలతో సినిమాలు చేసే తన స్టార్ హోదాను పెంచుకున్నారు.

మంత్రిగా బిజీగా..
ఇక సినిమాలలో హీరోయిన్ గా హడావిడి తగ్గిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక అక్కడ కూడా ఎన్నో అపజయాలను ఎదుర్కొన్న ఆమె మళ్ళీ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది ఒక ఎమ్మెల్యేగా తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు మంత్రిగా కూడా బాధ్యతలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

రోజా కూతురు..
ఇక రోజా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా రోజా కొన్నిసార్లు తన కూతురు అన్షు మాలికను రియాలిటీ షోలోకి కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా చిన్న వయసులోనే రోజా తన కూతురిని జనాలకు పరిచయం చేసింది. ఇక అన్షు సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా ఏదో ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ తన స్థాయిని పెంచుకుంటుంది.

మంచి స్టూడెంట్ గా..
రైటర్ గా కూడా మంచి పుస్తకాలను రచించిన అన్షు మల్లిక పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. మంచి స్టూడెంట్ గానే కాకుండా బాధ్యతగా తనకు తెలిసిన పేద విద్యార్థులకు కూడా నిత్యం ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటుంది. ఆ విషయంలో అన్షు చాలా బెస్ట్ అని క్రమశిక్షణలో కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని రోజా చాలాసార్లు వివరణ ఇచ్చారు.

హీరోయిన్ గా ఎంట్రీ?
అయితే ఇప్పుడు అన్షు మాలిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోనే ఒక సినీ వారసుడి మొదటి సినిమాలో కనిపించబోతోంది అని అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కోసం అమెరికా కూడా వెళ్లినట్లు సమాచారం. అక్కడ సినిమాలకు సంబంధించిన టెక్నికల్ విభాగాలలో అలాగే నటనపై కూడా ఆమె శిక్షణ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











